close

తాజా వార్తలు

Updated : 22/11/2020 14:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మూడు ‘డి’లదే భవిష్యత్‌ అంతా..: కేటీఆర్

హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ ఒక్కరోజులో రాలేదు

హైదరాబాద్‌: ఒక్కరోజులో, ఒక్క ప్రభుత్వంతో హైదరాబాద్‌కు బ్రాండ్‌ ఇమేజ్‌ రాలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ బ్రాండ్‌ ఇమేజ్‌ను కాపాడుతూనే వృద్ధిని కొనసాగించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉందని.. అందుకే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. హైదరారబాద్‌ హైచ్‌ఐసీసీలో నిర్వహించిన ‘బ్రాండ్‌ హైదరాబాద్‌ ఫ్యూచర్ రెడీ‌’ సదస్సులో కేటీఆర్‌ మాట్లాడారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఐటీ పెట్టుబడులు రెట్టింపయ్యాయని పేర్కొన్నారు. ఐదు ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలు హైదరాబాద్‌ను తమ రెండో చిరునామాగా ప్రకటించాయని తెలిపారు. వివిధ కంపెనీలు ప్రకటించిన పెట్టుబడుల్లో 40 శాతం ఇప్పటికే కార్యరూపం దాల్చాయని కేటీఆర్‌ వివరించారు.  

‘‘హైదరాబాద్‌ ప్రపంచంలో సురక్షితమైన నగరం. భౌగోళికంగానూ హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరం. ఐటీ అభివృద్ధికి మానవ వనరులు, ప్రభుత్వ విధానాలు, లాజిస్టిక్స్‌ ఎంతో అవసరం. అమెజాన్‌ కంపెనీ మొదట బెంగళూరును ఎంచుకుంది. తెలంగాణ ప్రభుత్వ పన్ను విధానలు నచ్చి అమెజాన్‌ హైదరాబాద్‌కు వచ్చింది. అమెజాన్‌ అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్‌లోనే ఉంది. అమెజాన్‌ హైదరాబాద్‌కు వచ్చేందుకు అధికారులు ఎంతో కృషి చేశారు. ఐటీ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం పలు దఫాలుగా  చర్చలు జరిపింది. కేవలం ఆరేళ్లలోనే తెలంగాణ స్టార్టప్‌ల పాలిట స్వర్గధామంగా మారింది. ఐటీ రంగంలో బెంగళూరు కంటే ఎక్కడ వెనకబడ్డామో పరిశీలించుకుంటున్నాం’’ అని కేటీఆర్‌ వివరించారు.

మూడు ‘డి’లదే భవిష్యత్‌ అంతా..

‘‘తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్‌ హబ్‌గా మారుతోంది. ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ రంగాల్లోనూ రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో నిలబెడతాం. అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్‌ క్యాబిన్‌ హైదరాబాద్‌లోనే తయారైంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలోనూ తెలంగాణ ముందువరుసలో ఉంది. జిల్లాల్లో ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఏరోస్పేస్‌ రంగంలో తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఐటీ, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో హైదరాబాద్‌ సత్తా చాటింది. రాబోయే రెండు దశాబ్దాల్లో ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలో మంచి భవిష్యత్తు ఉంది. హెల్త్‌కేర్‌ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో అవకాశం ఉంది. డీకార్బనైజేషన్‌, డిజిటలైజేషన్‌, డీసెంట్రలైజేషన్‌.. ఈ మూడు ‘డి’లదే భవిష్యత్‌ అంతా’’ అని కేటీఆర్ వివరించారు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని