close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 09/01/2020 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మంత్రి పేరుతో రాజభోగం అనుభవించి!

పనాజీ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి తాను మంత్రినని నమ్మించి ఏకంగా ఓ రాష్ట్ర ప్రభుత్వాధికారులనే బురిడీ కొట్టించాడు. ప్రోటోకాల్ పేరుతో పది రోజుల పాటు సకల సౌకర్యాలూ అనుభవించాడు. చివరకు ప్రవర్తన అనుమానం కలగడంతో విచారణలో నకిలీ అని తేలడంతో కటకటాలపాలయ్యాడు. సీఎం స్థాయి వరకు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచే ఈ ఘటన గోవా రాజధాని పనాజీలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సునీల్‌సింగ్‌ అనే వ్యక్తి ఇటీవల గోవాలో పర్యటించడానికి తన నలుగురు అనుచరులతో కలిసి వెళ్లాడు. అక్కడ ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహానికి వెళ్లి తాను యూపీకి చెందిన మంత్రినంటూ నమ్మబలికాడు. ఆపై నకిలీ ధ్రువపత్రాలు సైతం వారికి సమర్పించాడు. 

అక్కడి నుంచి పదిరోజుల పాటు మంత్రిగా సకల సౌకర్యాలు అనుభవించాడు. రక్షణగా పోలీసుల ప్రోటోకాల్‌ను సైతం పొందాడు. అనంతరం పలు విషయాలపై చర్చించడానికంటూ మినిస్టీరియల్‌ బ్లాక్‌కు వెళ్లి గోవా సహకార మంత్రి గోవింద్‌ గవాడేతోనూ సమావేశమయ్యాడు. ఆపై సీఎంతో సమావేశమవడానికి అనుమతి తీసుకున్నాడు. సీఎం ప్రమోద్‌ సావంత్‌కు అతడి తీరుపై అనుమానం కలిగి నేర విభాగ పోలీసులకు సూచించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు విచారించగా అతడు మంత్రి కాదని తెలియడంతో అవాక్కయ్యారు. అనంతరం ఆ మాయగాడిని అతడి అనుచరులను అరెస్టు చేశారు. తదుపరి విచారణకు సహకరించాలని యూపీ పోలీసులను కోరారు. దీనిపై మంత్రి గోవింద్ స్పందిస్తూ.. తనకు కూడా అతడితో జరిపిన 10 నిమిషాల సమావేశంలో అనుమానం కలిగిందని.. కానీ ఇతర పనుల వల్ల ఆ విషయాన్ని మరచిపోయినట్లు చెప్పారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.