close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 11/01/2020 18:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మోదీని కలిసి.. ధర్నాలో పాల్గొన్న సీఎం

కోల్‌కతా: ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అనంతరం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఏఏని వ్యతిరేకిస్తూ తృణమూల్‌ ఛత్రా పరిషద్‌ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కోల్‌కతాలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నిరసనలో విద్యార్థి సంఘాలతో కలిసి దీదీ పాల్గొన్నారు. అంతకముందే ఆమె పశ్చిమ బెంగాల్‌ పర్యటనకు వచ్చిన ప్రధానిని రాజ్‌భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా సీఏఏను వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆమె ప్రధానిని కోరారు. 

సీఏఏను మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇందులో భాగంగానే సీఎం స్వయంగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీఏఏకి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. ఈ పోరాటం తాము ఒంటరిగానే చేస్తామని ప్రతిపక్షాలతో కలవబోమని తెలిపారు. సీఏఏను ఎట్టి పరిస్థితుల్లోను రాష్ట్రంలో అమలు చేసేదే లేదని ఆమె స్పష్టం చేశారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

< script> var truepush = win dow.truepush || []; truepush.push(functi on () { truepush .Init({ id: "5e9021 767f1a31bbf7 453611" }, function (e rror) { if (error) co nsole.error ( error); }) })