close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 21/04/2020 16:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేంద్రంతో మమత ఢీ: కేంద్ర బృందాల నిర్బంధం?

దిల్లీ: పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంతో ఢీకొంటున్నట్టే కనిపిస్తున్నారు! లాక్‌డౌన్‌ అమలును పర్యవేక్షించేందుకు కోల్‌కతాకు వచ్చిన కేంద్ర బృందాలను క్షేత్రస్థాయికి వెళ్లనివ్వడం లేదని తెలుస్తోంది.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ సరిగ్గా అమలు కావడం లేదని, ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నగరాల్లో లాక్‌డౌన్‌ అమలు తీరును పరిశీలించేందుకు అంతర్‌ మంత్రిత్వ బృందాలను కేంద్రం ఏర్పాటు చేసింది. బెంగాల్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, మహారాష్ట్రకు పంపించింది. కాగా తెలంగాణ, తమిళనాడు, గుజరాత్‌లోనూ కేసులు పెరుగుతుండగా తమ రాష్ట్రంలోకే ఎందుకు పంపిచారో వివరణ ఇవ్వాలని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాను మమత డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు సహకరించబోమని బెదిరించారు.

‘ఈ రోజు మేం పర్యటించేందుకు సహకరిస్తామని మాటిచ్చారు. ఈ రోజేమో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారు. మమ్మల్ని బయటకు రానివ్వడం లేదు’ అని కోల్‌కతా పర్యటన బృందానికి నేతృత్వం వహిస్తున్న అపూర్వ చంద్ర అన్నారు. ‘కేంద్ర బృందాలు ఇతర రాష్ట్రాలకూ వెళ్లాయి. వారికి పూర్తి సహకారం లభించింది. పశ్చిమ్‌ బెంగాల్‌కు ఇచ్చినట్టే వారికీ నోటీసులు ఇచ్చారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులూ లేవు’ అని ఆయన మీడియాకు వెల్లడించారు. పశ్చిమ్‌ బెంగాల్‌లో లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్నారని నివేదికలు అందాయని ఇంతకుముందే కేంద్రం ఆ రాష్ట్రానికి రెండుసార్లు లేఖలు రాయడం గమనార్హం.

చదవండి: ర్యాపిడ్‌ టెస్టు కిట్లలో లోపించిన కచ్చితత్వం

చదవండి: అందరిది ఓ బాధ.. పాక్‌ది మరో బాధ!


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.