close
Array ( ) 1

తాజా వార్తలు

ఇంటి వద్దనే నేర్చుకోండి..: కేటీఆర్‌

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూతబడ్డాయి. దీంతో విద్యార్థులంతా ఇంట్లో ఖాళీగా ఉన్నారు. ఈ సమయాన్ని పిల్లలు, కళాశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా టి-సాట్‌ విద్య, నిపుణ ఛానళ్లు ప్రసారం చేస్తున్నట్లు చెప్పారు. వీటి ద్వారా ఇంటి వద్దనే గణితం, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, మరెన్నో నేర్చుకోవచ్చని తెలిపారు. అదే విధంగా పోటీ పరీక్షలకు సైతం సిద్ధం కావొచ్చని మంత్రి సూచించారు. 

టి-సాట్‌ విద్య, నిపుణ ఛానళ్ల ప్రసారాలు కేబుల్‌ నెట్‌వర్క్‌ ద్వారా, Tsat.tv, లేదా Youtube/tsatnetwork, T-SAT Mobile Appలలో ఇవి అందుబాటులో ఉంటాయని మంత్రి వివరించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.