close

తాజా వార్తలు

Published : 05/08/2020 00:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహారాష్ట్రలో ఒక్క రోజే 300 మంది మృతి

దిల్లీ: మహారాష్ట్రలో తాజాగా 7,760 కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 300 మరణాలు సంభవించాయి. ఇవాళ ఒక్క రోజే 12,326 మంది కరోనా బాధితులు డిశ్చార్జి అయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,99,356 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,57,956కి, మరణాల సంఖ్య 16,142కి చేరుకుంది. 1,42,151 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. ఇక ఆర్థిక రాజధాని ముంబయిలో 709 కొత్త కేసులు నమోదుకాగా, 873 మంది కోలుకున్నారు. 56 మంది మరణించినట్లు బృహన్ ‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది.

* కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న తమిళనాడులో ఇవాళ  మరో 5,063 కొత్త కేసులు వెలుగుచూశాయి. 108 మరణాలు సంభవించాయి. 6,501 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,68,285కి పెరిగింది. మరణాల సంఖ్య 4,349గా నమోదైంది. ఇప్పటి వరకు 2,08,784 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 55,152 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించారు. గడచిన 24 గంటల్లో 52,955 నమూనాలను పరీక్షించినట్లు తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

* కర్ణాటకలో కొత్తగా 6,259 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 110 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,45,830కి, మరణాల సంఖ్య 2,704కి చేరింది. ప్రస్తుతం 73,846 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యానికి ఆయన స్పందిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధిక జ్వరంతో బాధపడుతున్నారని, ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.