close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 01/05/2020 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉద్ధవ్‌కు ఊరట.. ఈసీకి గవర్నర్‌ లేఖ

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేకు ఊరట లభించింది. ఖాళీగా ఉన్న శాసన మండలి స్థానాలకు కొవిడ్‌-19 నియంత్రణ చర్యలు చేపడుతూ ఎన్నికలు నిర్వహించాలని గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఎన్నికల సంఘానికి (ఈసీ) లేఖ రాశారు. కరోనాపై పోరాడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయ అస్థిరత రాకుండా చూడాలని ఉద్ధవ్‌ ప్రధాని మోదీతో మాట్లాడిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

మహారాష్ట్ర శాసనసభలో గానీ, శాసనమండలిలో గానీ ఉద్ధవ్‌ సభ్యుడు కాని సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికలు జరిగిన ఆరు నెలల్లో ఆయన ఉభయ సభల్లో ఏదో ఒకదానిలో సభ్యత్వం పొందాల్సి ఉంటుంది. ఆ గడువు మే 28తో ముగియనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్-19 కేసులు అధికంగా నమోదవుతున్న ఈ పరిస్థితుల్లో రాజకీయ అస్థిరత ఏర్పడకుండా ఉద్ధవ్‌ను ఎమ్మెల్సీగా నియమించాలని కోరుతూ మంత్రి మండలి తీర్మానం చేసిన గవర్నర్‌కు పంపింది.  ఆ అంశం పెండింగ్‌లో ఉండడంతో ఉద్ధవ్‌ ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న 9 మండలి స్థానాలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి రాసిన లేఖలో గవర్నర్‌ పేర్కొన్నారు. వాస్తవానికి ఏప్రిల్‌లోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.