బదిలీలు సాధారణమే: మాదిరెడ్డి ప్రతాప్‌
close

తాజా వార్తలు

Published : 13/07/2020 20:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బదిలీలు సాధారణమే: మాదిరెడ్డి ప్రతాప్‌

అమరావతి: కరోనా పరీక్షలకు సంజీవిని పేరిట మొబైల్‌ వాహనాలు అందుబాటులోకి తెచ్చామని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ అన్నారు. ఆర్టీసీ రూపొందించిన ఈ వాహనాలను వైఎస్‌ విజయమ్మ అభినందించారన్నారు.అధికారులకు అభినందనలు తెలపాలని కేక్‌తోపాటు సందేశం పంపారని అన్నారు.మాదిరెడ్డి ప్రతాప్‌ను ఏపీఎస్పీ బెటాలియన్ల అడిషనల్‌ డీజీగా బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీ ఎండీగా ఇవాళ ఆఖరి పనిదినం సందర్భంగా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు... అధికారులకు బదిలీలు సాధారణమే అని అన్నారు. ఆర్టీసీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించే ప్రయత్నం చేశామన్నారు.

విజయవాడ బస్‌ మెట్రో కోసం నీతి ఆయోగ్‌కు ప్రతిపాదనలు పంపామని, దీనిని చైర్మన్‌ కూడా ప్రశంసించారని గుర్తు చేశారు. ‘‘ప్రత్యేక మార్గంలో బస్సులు మాత్రమే వెళ్లేలా మెట్రో రూపొందించాం.ప్రైవేటు ప్రాపర్టీ సేకరించకుండా ఎలివేటెడ్‌ కారిడార్‌ ఏర్పాటుకు అవకాశం ఉంది. భవిష్యత్‌ అవసరాల మేరకు అధునాతన సాంకేతికతతో బస్‌ మెట్రో ఉంటుంది. ఎలక్ట్రిక్‌, హైడ్రోజన్‌తో నడిచే బస్సులను కూడా బస్‌మెట్రోల్లో నడపవచ్చు. యూఎంటీసీ సంస్థతో రూ.30 లక్షలతో బస్‌ మెట్రో డీపీఆర్‌ తయారు చేశాం. 200 కి.మీ పొడవున బస్‌ మెట్రో ఉండాలని అంచనా వేశాం.ఈ విషయంపై దిల్లీకి వెళ్లి ప్రజెంటేషన్‌ ఇచ్చాను. వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ వల్ల విజయవాడ మెట్రో తిరస్కరించినట్లు చెప్పారు. ఆర్థిక సహాయం చేయడానికి వీల్లేదని పరిశీలనలో తేలినట్లు చెప్పారు’’అని ప్రతాప్‌ తెలిపారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని