close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/06/2020 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కారుచౌకలో కరోనా పరీక్ష!

 సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేసిన భారత శాస్త్రవేత్తలు

లఖ్‌నవూ:  కరోనా వైరస్‌ను 30 నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే గుర్తించే చౌకైన, ర్యాపిడ్‌ పరీక్ష విధానాన్ని భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆర్‌ఎన్‌ఏ ఆధారిత పరిజ్ఞానంతో పనిచేసే ఈ పరీక్షను రూ.500తో నిర్వహించవచ్చు. లఖ్‌నవూలోని సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. కొవిడ్‌-19 నిర్ధారణకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష విధానంలోనూ ఆర్‌ఎన్‌ఏ సాంకేతికతను వాడుతున్నారు. ఒక్కో పరీక్షకు దాదాపు రూ.5వేలు అవుతోంది. పైగా ఫలితం రావడానికి 3-5 గంటల సమయం పడుతోంది. తమ పరీక్ష విధానంతో అటు డబ్బు, ఇటు సమయం ఆదా అవుతాయని పరిశోధనలో పాల్గొన్న స్వస్తి తివారి తెలిపారు. ఈ పరిజ్ఞానంపై పేటెంట్‌ కోసం దరఖాస్తు చేశామన్నారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) నుంచి ఆమోదం లభిస్తే నాలుగు నెలల్లోనే ఈ కిట్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ‘హై స్క్రీన్‌’ అనే ఈ పరీక్షకు అధునాతన పరికరాలు, నైపుణ్యం అవసరం లేదన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.