close
Array ( ) 1

తాజా వార్తలు

అమెరికాలో విమాన ప్రమాదం..ఐదుగురిమృతి

అట్లాంటా: అమెరికాలో జరిగిన ఓ చిన్న విమాన ప్రమాద ఘటనలో ఐదుగురు మృతిచెందారు. ప్రమాద సమయంలో విమానంలో పైలట్‌తో పాటు ఐదుగరురు ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఒకరు ప్రాణాలతో బయటపడగా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అట్లాంటాలోని ఓ కళాశాలలో ఎల్ఎస్‌యూ, ఒక్లహామా జట్ల మధ్య జరగనున్న ఫుట్‌బాల్‌ పోటీని తిలకించడానికి వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. లూయిసానాలోని విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలింది. పోస్టాఫీస్‌ పార్కింగ్‌ స్థలంలో కూలడంతో అక్కడే ఉన్న ఓ కారు పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో కారులో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డట్లు స్థానికులు తెలిపారు. విమానంలో ఓ ప్రముఖ స్పోర్ట్స్‌ జర్నలిస్టుతో పాటు ఫుట్‌బాల్‌ జట్టు సభ్యుల బంధువులు, కళాశాల సిబ్బంది ఉన్నట్లు సమాచారం.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.