close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120047259 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => duPJxOoRPzM [video_short_link] => duPJxOoRPzM [created_by] => [created_date] => [modified_by] => 9820033 [modified_date] => 2020-04-08 17:44:40.603354 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

కట్టడి వేళ.. చిన్నారులు భళా..! 

ఆసక్తి ఉన్న అంశాల్లో గుర్తింపునకు యత్నం

లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూసివేయడంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా విపత్తు లేకపోతే చిన్నారులు ఇప్పటికే వేసవి సెలవులతో ఆటపాటల్లో మునిగిపోయేవారు. ఇప్పడు ఇంటి నుంచి బయటకు కూడా రాలేని పరిస్థితి. కొందరు చిన్నారులు మాత్రం ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమలోని ఆలోచనలకు పదునుపెడుతున్నారు. విజయవాడకు చెందిన కొందరు విద్యార్థులు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థిని శ్రీహర్షిత పుస్తక పఠనాన్ని కేవలం విజ్ఞానం, కాలక్షేపం కోసమే కాకుండా వెబ్‌పేజీ నిర్వహణకు వినియోగిస్తుంది. తన పాఠ్యంశాలతో పాటు చిన్న, పెద్ద ఆంగ్ల పుస్తకాలు సుమారు 70కి పైగా చదివింది. వాటికి సంబంధించిన సమీక్షలను ఆమె తన స్నేహితులతో పంచుకుంటోంది. ఓ యూటూబ్‌ ఛానల్‌ కూడా నిర్వహిస్తోంది. మరికొందరు చిన్నారులు కవిత్వం, చిత్రలేఖనంతో కరోనాపై స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంకొందరు సంగీతం, క్రీడలు వంటి ఇతర సృజనాత్మక అంశాల్లో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టిక్‌టాక్‌, లఘు చిత్రాల ద్వారా ఎక్కువ మందికి కరోనా మహమ్మారిపై సందేశం చేరేవేసేలా కృషి చేస్తున్నారు. 8వ తరగతి చదువుతోన్న తన అన్నయ్యతో కలిసి 4వ తరగతి విద్యార్థిని నేహ సృజనాత్మక అభినయంతో ఓ చిన్న వీడియోను రూపొందించింది.  ప్రభుత్వాలు, అధికారుల సూచనలు పాటిస్తూనే.. ఖాళీ సమయాన్ని తమలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు వినియోగించుకోవాలని ఈ చిన్నారులు తోటివారికి సూచిస్తున్నారు. 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.