close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 04/05/2020 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భద్రతా ప్రమాణాలతో పరిశ్రమలను అనుమతించాలి: సీఐఐ

దిల్లీ: ఆర్థిక కార్యకలాపాలు అధికంగా ఉండే జిల్లాల్లో అత్యధిక భద్రతా ప్రమాణాలు పాటిస్తూ, పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కోరింది. ఇందువల్ల ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడంతో పాటు ఉద్యోగ కోతలు ఏర్పడవని వివరించింది. లాక్‌డౌన్‌ జోన్లను వర్గీకరించేటపుడు ఆయా జిల్లాలు ఆర్థికంగా వ్యవస్థకు ఎంత సహకారం అందిస్తున్నాయనేది పరిగణనలోకి తీసుకోవాలని సీఐఐ సూచించింది. ‘ఎ స్ట్రాటెజీ నోట్‌ ఆన్‌ రిజమ్షన్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ యాక్టివిటీస్‌ ఇన్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాస్‌’ పేరుతో సీఐఐ ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ‘ఎక్కువ ఆర్థిక కార్యకలాపాలు ఉండే జిల్లాల్లో అన్ని పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలి. అక్కడ కంటెయిన్‌మెంట్‌ ప్రాంతమైనా సరే అత్యధిక భద్రతా ప్రోటోకాల్స్‌తో అనుమతించాల’ని సీఐఐ అందులో ప్రస్తావించింది. ఈ నెల 1న ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం, పారిశ్రామిక వాడలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు (ఎస్‌ఈజెడ్‌లు), పారిశ్రామిక టౌన్‌షిప్పుల్లో కార్యకలాపాల పునఃప్రారంభానికి అనుమతిస్తూనే, పట్టణ ప్రాంతాల్లోని రెడ్‌ జోన్లలో పరిమితులు విధించింది. కాగా, నోటిఫై చేయని పట్టణ ప్రాంతాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని సీఐఐ కోరింది. అలాగే పారిశ్రామిక ప్రాంతాల చుట్టుపక్కల పరిసరాల్ని ఆరెంజ్‌ జోన్‌లోకి వచ్చేలా వర్గీకరించాలని అభ్యర్థించింది. అత్యవసరం, అత్యవసరం కాని వస్తువులనే తేడా లేకుండా అన్ని ఫ్యాక్టర్టీలు తిరిగి ప్రారంభమవడానికి అనుమతించాలని నివేదికలో విజ్ఞప్తి చేసింది. ‘కొవిడ్‌-19 ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోవడాన్ని వీలైనంత తగ్గించేలా, మూడో విడత లాక్‌డౌన్‌లో వ్యూహాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాలు అధికంగా ఉన్న జిల్లాల్ని ప్రాధాన్య క్రమంలో వర్గీకరించి కార్యకలాపాలు తిరిగి ప్రారంభించుకోవడానికి అనుమతి ఇవ్వాలి. అప్పుడే ఆయా సంస్థలు ఆర్థిక స్థిరత్వం సాధించి, ఉద్యోగాల కోతకు పూనుకోవ’ని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ వెల్లడించారు.


* రికవరీకి ఏడాది  పటొచ్చు: సీఈఓల సర్వే
ఒకవేళ లాక్‌డౌన్‌ ముగిసినా, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి ఏడాదికి పైనే సమయం పట్టొచ్చని సీఐఐ నిర్వహించిన ముఖ్య కార్యనిర్వహణాధికారుల (సీఈఓ) సర్వేలో వెల్లడైంది. 45 శాతానికి పైగా సీఈఓలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత 15-30 శాతం ఉద్యోగాలకు కోత పడే అవకాశం ఉందని 45 శాతం మంది సీఈఓలు పేర్కొనడం గమనార్హం. ఇప్పటికైతే తమ సంస్థల్లో వేతన కోతలు లేవని 2/3 వంతు కంపెనీల సీఈఓలు తెలిపారు. దాదాపు 300కు పైగా సీఈఓలతో సీఐఐ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో 2/3 వంతు సూక్ష్మ, చిన్న మధ్య తరహా సంస్థల (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు) సీఈఓలే కావడం గమనార్హం. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయని, ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 65 శాతం సంస్థల ఆదాయం 40 శాతానికి పైగానే క్షీణించే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.