కర్నూలులో 31 కొత్త కేసులు..ఇద్దరి మృతి
close

తాజా వార్తలు

Published : 23/04/2020 16:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కర్నూలులో 31 కొత్త కేసులు..ఇద్దరి మృతి

కర్నూలు: కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి ప్రభావం మరింత ఎక్కువ అవుతోంది. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు ఈ జిల్లాలోనే నమోదయ్యాయి. ఇవాళ కొత్తగా 31 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.  తాజా కేసులతో జిల్లా వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 234కు చేరగా.. ఈరోజు ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. దీంతో కర్నూలు జిల్లాలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్‌ అవగా.. 223 మంది జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

కర్నూలు జిల్లాలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా మంత్రులు ఆళ్లనాని, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి‌, గుమ్మనూరు జయరాం జిల్లాలో పర్యటించారు. పరిస్థితిపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కర్నూలు సర్వజన వైద్యశాల ఆవరణలోని ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కొత్త ఓపీ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మెడికల్‌ కళాశాల మైక్రో బయాలజీ విభాగంలో ఏర్పాటు చేసిన వీఆర్‌డీఎల్‌ కొవిడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను తనిఖీ చేసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని