close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 14/01/2020 19:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రవితేజ.. శ్రుతిహాసన్‌.. ఓ బుడతడు..!

హైదరాబాద్‌: మాస్‌ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘క్రాక్‌’ సంక్రాంతి పోస్టర్‌ విడుదలైంది. కథానాయిక శ్రుతిహాసన్‌ లుక్‌ను తెలుపుతూ ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమాలో రవితేజ భార్యగా శ్రుతిహాసన్‌ నటిస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి ఓ బాబు కూడా ఉన్నట్లు పోస్టర్‌ను బట్టి అర్థమౌతోంది. ‘మా లాగే మీరు కూడా ఈ పండగ మీ కుటుంబ సభ్యులతో సరదాగా జరుపుకోండి. మకర సంక్రాంతి శుభాకాంక్షలు’ అంటూ పోస్టర్‌ను శ్రుతి హాసన్‌ షేర్‌ చేశారు.

గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ బాణీలు అందిస్తున్నారు. సరస్వతి ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. వేసవికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.