close

తాజా వార్తలు

‘వరల్డ్‌ షార్టెస్ట్‌ మ్యాన్‌’ ఖగేంద్ర థాపా కన్నుమూత

పొఖారా(నేపాల్‌): ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తైన వ్యక్తిగా గతంలో గిన్నిస్‌ రికార్డ్స్‌కు ఎక్కిన నేపాల్‌కు చెందిన ఖగేంద్ర థాపా మాగర్ కన్నుమూశారు.  గత కొంత కాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న 27 ఏళ్ల ఖగేంద్ర పొఖారాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఖగేంద్ర థాపా మాగర్‌ ఫౌండేషన్‌ వర్గాలు వెల్లడించాయి. 67.08 సె.మీ(సెంటిమీటర్)ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తైన వ్యక్తిగా 2010లో ఖగేంద్ర గిన్నిస్‌ రికార్డ్స్‌కు ఎక్కారు. ఆయన 1992 అక్టోబర్‌ 14న పొకారాలో జన్మించారు.  

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.