close

తాజా వార్తలు

Published : 16/03/2020 20:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరోసారి నిలిచిపోయిన అమెరికా మార్కెట్లు

వాషింగ్టన్‌: అమెరికా స్టాక్‌ మార్కెట్లు సోమవారం మరోసారి నిలిచిపోయాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే వాల్‌స్ట్రీట్‌ మార్కెట్లు తీవ్ర నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలోనే ఎస్‌ అండ్‌ పీ 500 షేర్లు 8శాతం నష్టాల్లోకి జారుకోవడంతో మార్కెట్లను 15 నిమిషాల పాటు నిలిపివేశారు. వాల్‌స్ట్రీట్‌ మార్కెట్లు ఆరు రోజుల వ్యవధిలో ఇలా నిలిచిపోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

యూఎస్‌ సెంట్రల్‌ బ్యాంకు ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్ల కోత కారణంగా మదుపర్లు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు కరోనా మహమ్మారి భయాలు కూడా వెంటాడటం నష్టాలకు కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో ఉదయం 9.30 గంటలకు డొజోన్స్ 2,250 పాయింట్లు, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు 220 పాయింట్లు, నాస్‌డాక్‌ 482 పాయింట్లు నష్టపోవడం గమనార్హం. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని