
తాజా వార్తలు
ఏపీకి పెట్టుబడులు రావడం లేదు: కళా
అమరావతి: సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొమ్మిది మాసాల పాలనలో కూల్చివేతలు, రద్దులే మిగిలాయని ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ఏపీలో వైకాపా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెనక్కిపోతున్నాయని ఆయన ఆరోపించారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అవంబిస్తోన్న విధానాల వల్ల రిలయన్స్, అదాని సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని.. రాష్ట్రానికి కొత్తగా ఎలాంటి పెట్టుబడులు రావడం లేదన్నారు. సంక్షేమ పథకాల్లో అర్హులకు కోత పెడుతున్నారని ఆక్షేపించారు. వైఎస్ హయాం నాటి కొందరు అధికారులపై ఇప్పటికీ కేసులున్నాయన్నారు. చంద్రబాబుపై వైఎస్, విజయమ్మ వేసిన వ్యాజ్యాలు వీగిపోయాయని గుర్తుచేశారు.
Tags :