వైద్య సిబ్బందికి తగిన భరోసా ఇవ్వాలి:పవన్‌
close

తాజా వార్తలు

Published : 07/04/2020 15:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైద్య సిబ్బందికి తగిన భరోసా ఇవ్వాలి:పవన్‌

అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఎంతో సాహసోపేతంగా పనిచేస్తున్నారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. వైద్యులను భగవంతుడితో సమానంగా చూసే సంస్కృతి మనదేశానిదన్నారు.

‘‘మానవతామూర్తులైన ఎందరో వైద్యులు తమ వృత్తి ధర్మంతో పేదలకు ఎనలేని సేవలు చేస్తున్నారు. తమకీ, తమ కుటుంబానికీ వైరస్ ముప్పు ఉంటుందని తెలిసీ రోగులకు సేవలు చేస్తున్నవారిని ఎప్పటికీ మరచిపోకూడదు. విధి నిర్వహణలో ఉన్న వైద్యులకు, పారా మెడికల్ సిబ్బందికి ప్రభుత్వం తగిన రక్షణ, భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కోవిడ్-19 విధుల్లో ఉన్నవారందరికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా పీపీఈలు సమకూర్చాలి. రోగుల సేవలో ఉన్న నర్సులు, ప్రసూతి ఆయాల ఆర్థిక పరిస్థితి మెరుగు పరచడంతో పాటు ఉద్యోగ భద్రతకు తగిన చట్టాలు తీసుకురావాలి’’ అని పవన్‌ కోరారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని