close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 30/04/2020 15:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కార్మికలోకం శ్రమను గౌరవించాలి: పవన్‌

అమరావతి: ఏ దేశ ఆర్థిక పురోగతికైనా శ్రామికుల కష్టించేతత్వమే ప్రధాన ఇంధనమని.. కార్మిక లోకం శ్రమను గుర్తించి గౌరవించడం అందరి బాధ్యతని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా ఆ బాధ్యతను మరోసారి గుర్తుచేసుకోవాలని చెప్పారు. యావత్ కార్మిక లోకానికి జనసేన పార్టీ తరఫున పవన్‌ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మూలంగా తలెత్తుతున్న పరిస్థితుల ప్రభావం కార్మికులపై పడే ప్రమాదం ఉందని.. ఈ కష్ట కాలంలో వారి సమస్యలపై అందరూ సానుభూతితో స్పందించాలన్నారు. వారి ఉపాధికి చట్టబద్ధమైన రక్షణ కలిగించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించి ఎంతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు ఈ సమయంలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని పవన్ కోరారు. అసంఘటిత రంగాల్లోని కార్మికుల సంక్షేమం గురించి తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.