close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 15/04/2020 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మీ ఆరోగ్యం జాగ్రత్త సోనియాజీ: నడ్డా

వీడియో సందేశంపై భాజపా ఎద్దేవా

దిల్లీ: మంగళవారం ఉదయం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ విడుదల చేసిన వీడియో సందేశంపై భాజపా విమర్శలు చేసింది. మీ ఆరోగ్యం జాగ్రత్త సోనియాజీ అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి కొద్ది గంటల ముందు సోనియా ఆ వీడియోను విడుదల చేశారు. దానిలో ఆమె కరోనాపై పోరులో ముందుండి దేశ రక్షణకు పాటుపడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర అత్యవసర సేవల్లో విధులు నిర్వర్తిస్తోన్న సిబ్బందిని ప్రశంసించారు.  క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ఈ ఆరోగ్య సంక్షోభాన్ని ఓడిద్దామని పిలుపునిచ్చారు.

ఆ వీడియో సందేశాన్ని ఉద్దేశించి జేపీ నడ్డా ట్విటర్ వేదికగా స్పందించారు. ‘థ్యాంక్యూ సోనియాజీ, మీ ఆరోగ్యం జాగ్రత్త’ అని ట్వీట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో కూడా కాంగ్రెస్‌ రాజకీయాలకు పాల్పడుతోందని గతంలో కూడా ఆ పార్టీ అధినేత్రిపై విమర్శలు గుప్పించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.