close

తాజా వార్తలు

Published : 24/03/2020 21:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ.1.82 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు పుంజుకోవడంతో మదుపర్ల సంపద ఒక్కరోజులోనే రూ.1,82,769.92 కోట్లు పెరిగింది. సోమవారం మహాపతనమైన సూచీలు మంగళవారం కొంత రికవరీ అయ్యాయి. సెన్సెక్స్‌ 692.79 పాయింట్లు లాభపడింది. దీంతో బీఎస్‌ఈ నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ రూ.1.82 లక్ష కోట్ల మేర పెరిగి రూ.1,03,69,706.20 కోట్లకు చేరుకుంది. గత సెషన్‌లో సెన్సెక్స్‌ 3,934.72 పాయింట్లు పతనమైన సంగతి తెలిసిందే.

‘గత సెషన్లో సూచీలు పతనమైన తర్వాత భారత మార్కెట్లలో కొనుగోళ్లు పెరిగాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, భారత ప్రభుత్వం ఉద్దీపన పథకం ప్రకటిస్తుందన్న విశ్వాసం ఇందుకు దోహదం చేసింది. కొన్ని సూచీలు ఇంకా మెరుగవ్వకున్నా బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ మాత్రం 1.6 శాతం పెరుగుదల నమోదు చేసింది’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ రీసెర్చ్‌ విభాగం ఉపాధ్యక్షుడు అజిత్‌ మిశ్రా అన్నారు.

అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆదుకొనేందుకు ఫెడరల్‌ రిజర్వు చర్యలు తీసుకుంటామని ప్రకటించడంతో ఆసియా సూచీలు సోమవారం లాభపడ్డాయి. దాంతో ఈక్విటీ బెంచ్‌మార్క్‌ ఆరంభ సెషన్లో 1400 పాయింట్లు రికవరీ అయ్యింది. ‘లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ వ్యాపారాలు, పన్ను చెల్లింపుదారులకు తుది గడువులు పొడిగించడం, నిబంధనలు సడలించడం వంటివి ఉపశమనం కలిగించాయి. ఇప్పుడు దృష్టంతా తక్కువ సంపాదన ఉన్నవాళ్ల పైనే ఉంది.  లాక్‌డౌన్‌ ద్వారా వారే ఎక్కువ నష్టపోతున్నారు. ఏటీఎం రుసుములు తొలగించడం పౌరులకు మేలు చేస్తుంది’ అని జియోజిత్‌ ఆర్థిక సేవల సంస్థ పెట్టుబడుల ముఖ్య వ్యూహకర్త వీకే విజయకుమార్‌ అన్నారు.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని