లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు
close

తాజా వార్తలు

Published : 10/06/2020 09:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:38 గంటల సమయంలో సెన్సెక్స్‌ 208 పాయింట్లు లాభపడి 34,164 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 54 పాయింట్లు ఎగబాకి 10,101 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.26 వద్ద కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల దిశగా సాగుతుండడం దేశీయ సూచీలకు కలిసొచ్చింది. మరోవైపు అమెరికా మార్కెట్లు మిశ్రంగా ముగిశాయి. కీలక కంపెనీల షేర్లు రాణిస్తుండడం కూడా సూచీల సెంటిమెంటును పెంచింది. 

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, శ్రీ సిమెంట్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, వేదాంత షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. గెయిల్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, హీరో మోటోకార్ప్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, కోల్‌ ఇండియా షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని