close

తాజా వార్తలు

Updated : 13/03/2020 12:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేంద్రం కరోనాను ఎదుర్కోలేకపోయింది: రాహుల్‌

దిల్లీ: కరోనా వైరస్‌ సమస్యను ఎదుర్కొనడంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. గురువారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనం కావడంపై ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. 

‘స్టాక్‌ మార్కెట్ల ప్రభావం వల్ల లక్షలాది మంది ప్రజలు ప్రభావం వల్ల నష్టపోతున్నారు. కరోనా వైరస్‌ అనేది తీవ్రమైన సమస్యే కానీ.. కానీ దాన్ని సరిగా ఎదుర్కొనడంలో ప్రభుత్వం విఫలమైంది. మన ఆర్థిక వ్యవస్థే.. మన బలం. కానీ మోదీ హయాంలో వారి విధానాలు, సిద్ధాంతాల వల్ల ఆర్థిక వ్యవస్థ నాశనం అయింది. ప్రధాని మోదీ ప్రస్తుత పరిస్థితులకు గల కారణాల్ని వెల్లడించాలి. మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయాలపై ఆయనకు అవగాహన ఉండేది. ఇప్పుడు ఉన్న పరిస్థితికి మోదీ ప్రారంభించిన నోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటి ఫలితాలే కారణం. ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అని రాహుల్‌ ఆరోపించారు.

సింధియాకు అక్కడ గౌరవం ఉండదు

అదేవిధంగా జ్యోతిరాదిత్య సింధియా భాజపాలో చేరడంపై రాహుల్‌ స్పందిస్తూ.. ‘భవిష్యత్తు గురించి భయంతోనే సింధియా తన భావజాలాన్ని మర్చిపోయారు. భాజపాలో తనకు తగిన గౌరవం లభిస్తుందని అనుకోవడం లేదు. ఆయన అక్కడ సంతృప్తిగా ఉండలేరు’ అని పేర్కొన్నారు. సింధియా మంగళవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అనంతరం నిన్న భాజపాలో చేరిన విషయం తెలిసిందే. 



 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని