నిజమైన హీరోలకు జెర్సీల వెనుక పేర్లుండవు
close

తాజా వార్తలు

Published : 26/07/2020 14:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిజమైన హీరోలకు జెర్సీల వెనుక పేర్లుండవు

అమరవీరులకు భారత క్రికెటర్ల నివాళులు

ఇంటర్నెట్‌డెస్క్‌: 1999లో పాకిస్థాన్‌పై సాధించిన కార్గిల్‌ యుద్ధ విజయాన్ని పురస్కరించుకొని టీమ్‌ఇండియా క్రికెటర్లు భారత అమరవీరులకు నివాళులు అర్పించారు. సామాజిక మాధ్యమాల్లో త్రివిధ దళాల ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. వారి త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు.

* కార్గిల్‌ యుద్ధంలో మన భారత రక్షణ దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఎంతో స్ఫూర్తిదాయకం. మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి మనమెప్పుడూ రుణపడి ఉంటాం. - సచిన్‌ తెందూల్కర్‌

* మనం జీవిస్తున్న ఈ రోజు కోసం వాళ్ల భవిష్యత్‌ను త్యాగం చేసిన అమరవీరులకు వందనం. -రిషభ్‌పంత్‌

* ఈ కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకొని నాటి యుద్ధంలో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారత జవాన్లకు సెల్యూట్‌ చేస్తున్నా. వారి త్యాగాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. -యువరాజ్‌ సింగ్‌ 

* మన దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన హీరోలను ఎప్పటికీ మరవకూడదు. భారత సైన్యం పట్ల గర్వంగా ఉంది. జై హింద్‌ -అజింక్య రహానె

* 24 గంటలూ మనల్ని కాపాడే భారత జవాన్ల ధైర్య సాహసాలకు సెల్యూట్‌. మీరు ఉండటం వల్లే మేం ఉన్నాం. -మహ్మద్‌ కైఫ్‌

* నిజమైన హీరోలకు తమ జెర్సీల వెనుక పేర్లుండవు. అలాంటి వారు తమ దేశ పతాకాన్ని ధరిస్తారు.- గౌతమ్‌ గంభీర్‌

* మనల్ని కాపాడిన అమర జవాన్లకు నివాళులు. అలాగే ఇప్పుడు కాపాడుతున్న సైనికులకు వందనం. మీరు ఉండటం వల్లే మేమున్నాం.- వీరేందర్‌ సెహ్వాగ్‌

* భారత రక్షణ దళాల ధైర్య సాహసాలకు సెల్యూట్‌ చేస్తున్నా. దేశం కోసం పోరాడి ప్రాణాలొదిలిన వీరులకు వందనం. -విరాట్‌ కోహ్లీ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని