close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 28/06/2020 12:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చైనా విద్యుత్తు సామగ్రితో జాగ్రత్త

దిల్లీ: చైనా నుంచి వచ్చే విద్యుత్తు పరికరాలతో అప్రమత్తంగా ఉండాలని భారత్‌ హెచ్చరించింది. ముఖ్యంగా విద్యుత్తు సంస్థలు వినియోగించే వాటిలో మాల్వేర్‌, ట్రోజన్‌ హర్స్‌లను ప్రవేశపెట్టి చైనా విక్రయించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ సామగ్రి కనుక భారత్‌ విద్యుత్తు గ్రిడ్‌తో అనుసంధానమైతే సంక్షోభ సమయంలో చైనా అవి కుప్పకూలేటట్లు చేస్తుందని పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ స్వయంగా పేర్కొనడం గమనార్హం. ఆయన పీటీఐకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో భారత్‌లో దేశీయ ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించేందుకు చైనా పరికరాలపై అత్యధిక టారీఫ్‌లు విధిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగంలో వినియోగించే పరికరాలపై ఈ చార్జీలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

‘‘విద్యుత్తు రంగం అత్యంత వ్యూహాత్మకమైంది. దేశంలోని కంపెనీలు, పరిశ్రమలు, కమ్యూనికేషన్లు దీనిపై ఆధారపడి నడుస్తాయి. ఏదైనా శత్రుదేశం ఈ మార్గంలో భారత్‌ను దెబ్బతీసే అవకాశం మేము ఇవ్వం. దీనికి అడ్డుగా ఓ ఫైర్‌వాల్‌ నిర్మాణం చేపడతాము. వీటిల్లో మాల్వేర్లు, ట్రోజన్‌ హార్స్‌ లు  ఉంటున్నట్లు మాకు సమాచారం ఉంది. అందుకే ఈ సున్నితమైన రంగంలో భారతీయ పరికరాలు ఉండేట్లు చూస్తాము . ఒక వేళ దిగుమతులు అవసరమైతే పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడతాము’’ అని పేర్కొన్నారు. భారత్‌లోని విద్యుత్తు రంగంపై ఇప్పటికే పలుమార్లు సైబర్‌ దాడులు జరిగాయి. వీటిల్లో అత్యధికభాగం రష్యా, చైనా, సింగపూర్‌, కామన్‌వెల్త్‌ దేశాల నుంచే జరిగినట్లు గుర్తించారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.