close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 21/05/2020 10:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అది భారత్‌కు సువర్ణావకాశం: ఎలైస్‌ వెల్స్‌

వాణిజ్య ఒప్పందంపై.. అమెరికా దౌత్యవేత్త ఎలైస్‌ వెల్స్‌

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌తో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభాన్ని భారత్‌ సద్వినియోగం చేసుకోవాలని, అది సువర్ణావకాశమని అమెరికాకు చెందిన సీనియర్‌ దౌత్యవేత్త ఎలైస్‌ వెల్స్‌ అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి భారత్‌ ముందడుగు వేయాలని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అయితే, తమతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి ముందు భారత్‌ ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందాలు బలపడడానికి అమెరికా ఎంతగానో ఎదురుచూస్తోందని ఎలైస్‌‌ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి తొలగిపోయాక తమ కంపెనీలు వాటి సేవలను విస్తరించాలని చూస్తున్నాయని, అది భారత్‌కు మంచి అవకాశమని వివరించారు. భారత్‌ రక్షణాత్మక ధోరణితో కాకుండా స్నేహపూర్వక విధానాలతో ముందుకు రావాలని ఎలైస్‌ సూచించారు. 

తమది వాణిజ్య ఒప్పందాలు చేసుకునే దేశమని, నిర్ణయాలు కఠినంగా ఉన్నా అలాగే చేస్తామని స్పష్టం చేశారు. భారత్‌ మాత్రం ఆ స్థాయిలో ఒప్పందాలు చేసుకునేలా కనిపించడం లేదని చెప్పారు. అలా వ్యవహరించడం వల్ల అమెరికా ఒక్కదాంతోనే సమస్య కాదని.. యూరోపియన్‌ యూనియన్‌, ఆస్ట్రేలియా లాంటి ఇతర దేశాలతోనూ భారత సంబంధాలు దెబ్బతింటాయన్నారు. చైనా నుంచి ఇతర దేశాలు తప్పుకోవాలని చూస్తున్న నేపథ్యంలో భారత్‌కు మంచి అవకాశం లభిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌.. సరైన విధానాలు, మౌలిక సదుపాయాలతో ముందుకు వస్తే అర్ధవంతంగా ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే అమెరికా సైతం భారత్‌కు చేయూతనివ్వాలని చూస్తుందని ఆమె వివరించారు. 

భారత్‌, అమెరికా గత రెండేళ్లుగా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని చూస్తున్నాయని.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా గత సెప్టెంబర్‌లోనే త్వరలో ఈ ఒప్పందాలపై సంతకం చేస్తానని చెప్పినట్లు ఎలైస్‌ గుర్తుచేశారు. కాగా, ఫిబ్రవరిలో ట్రంప్‌.. భారత పర్యటన సందర్భంగా అది కార్యరూపం దాలుస్తుందని భావించినా కుదరలేదు. ఎలాంటి వాణిజ్య ఒప్పందంలోనైనా కొన్ని సమస్యలుంటాయని, రెండేళ్లుగా తాము వాటిపైనే దృష్టిపెట్టామని చెప్పారు. మరోవైపు అమెరికా ఉత్పత్తుల విషయంలో సుంకం తగ్గించాలనుకుంటే అది అధ్యక్షుడి నిర్ణయమని స్పష్టంచేశారు. దీంతో భారత్‌ తన మార్కెట్‌ను తెరవడానికి ఎంతవరకు సిద్ధంగా ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు ఔషద రంగంలోనూ భారత్‌ ఎంతో మెరుగైనస్థితిలో ఉందని, ట్రంప్ కూడా దాన్ని గుర్తించారని ఎలైస్‌ తెలిపారు. కరోనా టీకా అభివృద్ధికి భారత్‌ కీలక భాగస్వామి అని, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అమెరికాతో కలిసి పనిచేస్తుందని చెప్పారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.