హార్దిక్‌ ఫిట్‌గా లేకపోతే ప్రత్యామ్నాయం ఏది?
close

తాజా వార్తలు

Published : 29/11/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హార్దిక్‌ ఫిట్‌గా లేకపోతే ప్రత్యామ్నాయం ఏది?

ఇంటర్నెట్‌డెస్క్‌: పూర్తి ఫిట్‌నెస్‌ సాధించని ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టే వరకు కోహ్లీసేన జట్టులో అసమతుల్యత ఉంటుందని టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్‌ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. మరో ఆల్‌రౌండర్‌గా విజయ్ శంకర్‌ ఉన్నప్పటికీ హార్దిక్‌ స్థాయిలో సత్తా చాటలేడని అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయిదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 374 పరుగుల భారీ స్కోరు సాధించింది. పూర్తి ఫిట్‌నెస్‌తో లేని కారణంగా హార్దిక్‌ బౌలింగ్‌కు దూరంగా ఉన్నాడు. కాగా, హార్దిక్‌ను స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా జట్టులోకి తీసుకోవడంపై గంభీర్ స్పందించాడు.

‘‘ఇది కీలక సమయం. గత ప్రపంచకప్‌ నుంచి ఇదే జరుగుతోంది. హార్దిక్‌ బౌలింగ్ చేయడానికి ఫిట్‌గా లేకపోతే ఆరో బౌలింగ్ ఆప్షన్‌ ఎక్కడ? విజయ్ శంకర్‌ ప్రత్యామ్నాయంగా భావించవచ్చు. కానీ అయిదు లేదా ఆరో స్థానంలో హార్దిక్ తరహాలోనే అతడు బ్యాటింగ్ చేయగలడా?అంతేగాక ఏడు నుంచి ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేయగలడా? మనీష్‌ పాండే జట్టులో ఉన్నా, రోహిత్ శర్మ తుదిజట్టులోకి తిరిగొచ్చినా ఇదే పరిస్థితి. టాప్‌-6లో ఉన్న ఆటగాళ్లలో ఎవరూ బౌలింగ్ చేయలేరు’’ అని గంభీర్ పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియా జట్టులో ఇలాంటి సమస్యలు లేవని, ప్రత్యామ్నాయ బౌలర్లుగా ఎంతో మంది ఉన్నారని గంభీర్‌ తెలిపాడు. ‘‘ఆస్ట్రేలియా జట్టును చూస్తే హెన్రిక్స్‌ ఉన్నాడు. అతడు కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలడు. అంతేగాక సీన్ అబాట్‌ బౌలింగ్ ఆల్‌రౌండర్‌. డేనియల్ సామ్స్‌ కూడా బౌలింగ్, బ్యాటింగ్ చేయగలడు. మరీ, హార్దిక్‌కు పూర్తి ఫిట్‌నెస్ లేకపోతే భారత్‌ తరఫున ప్రత్యామ్నాయంగా ఇంకెవరున్నారు?’’ అని గంభీర్‌ అన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆదివారం రెండో వన్డే జరగనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని