close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 19/05/2020 22:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విడిపోక తప్పట్లేదు... 

ప్రకటించిన ప్రముఖ నటుడి భార్య

దిల్లీ: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ తన 46వ జన్మదినం నాడే అనుకోని కారణాల వల్ల వార్తల్లో నిలిచారు. ఆయన సతీమణి ఆలియా సిద్దిఖీ విడాకులు కోరుతూ నవాజుద్దీన్‌కు నోటీసులు పంపినట్టు తాజాగా వెల్లడయింది. ఓ అంగ్ల ప్రత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... తమకు 2009లో వివాహమయిందని, అయితే తమ వైవాహిక జీవితం గత పది సంవత్సరాలుగా ఒడిదొడుకుల్లోనే ఉందని ఆలియా పేర్కొన్నారు. వివాహాన్ని రద్దు చేసుకోవటానికి కరోనా లాక్‌డౌన్‌ను ఓ మంచి అవకాశంగా అమె భావిస్తున్నారట. విడాకులను, మనోవర్తిని కోరుతూ తాను వాట్సప్‌, ఇ-మెయిల్‌ ద్వారా మే 7న తన భర్తకు నోటీసులు పంపినట్టు ఆలియా వెల్లడించారు. అయితే తను ఈ నిర్ణయానికి రావటానికి దారితీసిన కారణాలను మాత్రం ఇప్పుడు వివరించలేనని ఆలియా సిద్దిఖీ అంటున్నారు. కాగా, నవాజుద్దీన్‌కు ఇది రెండవ వివాహం. ఈ జంటకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఉత్తర్‌ ప్రదేశ్‌లోని తన స్వగ్రామం బుధానాలో ఉన్న నవాజుద్దీన్‌, ఈ విషయమై ఇంకా స్పందించాల్సి ఉంది.

నవాజుద్దీన్‌ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగారు. మొదట్లో వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోకుండా అతి చిన్న పాత్రల్లో కూడా కనిపించిన ఈ నటుడికి... 12 ఏళ్ల తర్వాత గ్యాంగ్స్‌ ఆఫ్‌ వస్సేపూర్‌ రూపంలో ప్రధాన పాత్రతో పాటు పెద్ద బ్రేక్‌ లభించింది. ఈయన నటించిన ఘూమ్‌కేతు హిందీ చిత్రం మే 22న ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా విడుదల కానుంది. మిల్కీ బ్యూటీ తమన్నా, నవాజుద్దీన్‌ జంటగా నటించిన బోలే చూడియా హిందీ చిత్రం నిర్మాణంలో ఉంది. ఇక దక్షణాది విషయానికి వస్తే... నవాజుద్దీన్‌ రజనీకాంత్‌ నటించిన పేట చిత్రంలో కీలకపాత్ర పోషించారు. వెంకటేశ్‌ కథానాయకుడిగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో రానున్న ఓ తెలుగు చిత్రంలోముఖ్యపాత్ర కోసం ఈయనను సంప్రదించినట్టు సినీవర్గాల సమాచారం.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.