close

తాజా వార్తలు

Published : 01/10/2020 07:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చౌకైన ఎంజైముతో కరోనా చికిత్స!

దిల్లీ: అత్యంత చౌకగా లభించే కేటలేస్‌ ఎంజైము... శరీరంలో కరోనా వైరస్‌ పునరుత్పత్తిని కట్టడి చేసి, కొవిడ్‌ లక్షణాలను ప్రభావవంతంగా మాయం చేయగలదని తాజా అధ్యయనంలో రూఢి అయింది. ఈ క్రమంలో... కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు కొవిడ్‌ రోగుల్లో దీని ప్రభావంపై పరిశోధన సాగించారు.
‘‘కరోనా కారణంగా శరీరంలో వాటిల్లే అంతర్గత వాపులను కేటలేస్‌ కట్టడి చేయగలదు. దీని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ప్రభావం కారణంగా... తెల్లరక్తకణాల్లో సైటోకీన్ల ఉత్పత్తి నియంత్రణలో ఉంటుంది. కొవిడ్‌ బాధితుల్లో ఈ ప్రొటీన్ల సంఖ్య పెరిగితే... శరీరం తన సొంత కణాలను నశింపజేసుకునే పరిస్థితి (సైటోకీన్‌ స్టార్మ్‌) తలెత్తుతుంది. ఊపిరితిత్తుల వరకూ వ్యాపించి ఉండే వాయుకోశ కణాలకు కూడా కేటలేస్‌ రక్షణ కల్పిస్తోంది’’ అని పరిశోధనకర్త యున్‌ఫెంగ్‌ లూ చెప్పారు. ఈ ప్రొటీన్‌తో కరోనా చికిత్సను రూపొందించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.