close

తాజా వార్తలు

అప్పటిలోగా రాకుంటే పార్టీలతో గవర్నర్‌ చర్చలు

ముంబయి: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు 7వ తేదీలోపు ఏ పార్టీ ముందుకు రాకుంటే రాజకీయ పార్టీలతో గవర్నర్‌ నేరుగా చర్చలు జరపనున్నారని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌పీఐ) అధినేత, కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే తెలిపారు. ఈ మేరకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కొషియారి తనతో పాటు పలువురు పార్టీ ప్రతినిధులతో శనివారం సాయంత్రం మాట్లాడారని తెలిపారు. ఈ నెల 9తో 13వ అసెంబ్లీ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో నవంబర్‌ 7 వరకు గవర్నర్‌ వేచి చూస్తారని, ఒకవేళ ఎవరూ ముందుకు రాని పక్షంలో గవర్నరే స్వయంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన పార్టీలతో చర్చలు జరుపుతారని అథవాలే తెలిపారు. 

భాజపా మిత్రపక్ష పార్టీల ప్రతినిధులు శనివారం గవర్నర్‌ను కలిశారు. భాజపానే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వారు గవర్నర్‌ను కోరారు. భాజపా సొంతంగా 105 సీట్లు గెలుచుకుందని, ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో ఆ పార్టీ బలం 120కి చేరిందని వివరించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో అథవాలే సహా ఆర్‌పీఐ నేత అవినాశ్‌ మహటేకర్‌, స్వాభిమాన్‌ పక్షకు చెందిన సదాబౌ కోట్‌, రాష్ట్రీయ సమాజ్‌ పక్షకు చెందిన మహదేవ్‌ జనకర్‌ ఉన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలకు ఎన్నికలు జరగ్గా భాజపాకు 105, శివసేన 56 సీట్లు గెలిచాయి. ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు సాధించాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపాకు శివసేన మద్దతు తప్పనిసరైన నేపథ్యంలో సీఎం పీఠంపై శివసేన ‘50-50’కి పట్టుబడుతోంది. దీంతో ఫలితాలు వెలువడి ఇన్ని రోజులు గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడడం లేదు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.