కెనడాలో కాల్పులు.. 16 మంది మృతి
close

తాజా వార్తలు

Updated : 20/04/2020 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కెనడాలో కాల్పులు.. 16 మంది మృతి

గత 30ఏళ్ల చరిత్రలో అత్యంత దారుణ ఘటన

ఒట్టావా(కెనడా): కెనడాలో పోలీసు దుస్తులు ధరించి వచ్చిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. నోవా స్కోటియా రాష్ట్రంలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఓ మహిళా పోలీసు సహా 16 మంది మృతిచెందారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు కూడా మృతిచెందినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు, స్థానిక యంత్రాంగం.. ఇప్పటికే కరోనా వైరస్‌  వల్ల లాక్‌డౌన్‌లో ఉన్న ప్రజల్ని బయటకు రావొద్దని సూచించారు. దుండగుడు పోలీసుల దుస్తులు ధరించి, కారును కూడా పోలీసుల వాహనం వలే రూపొందించాడని అధికారులు తెలిపారు.

గత 30 ఏళ్ల కెనడా చరిత్రలో ఇంతటి దారుణ ఘటన జరగడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. చివరి సారి 1989లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 14 మంది మృత్యువాతపడ్డారు. అప్పటి నుంచి దేశంలో తుపాకుల వాడకంపై కఠిన ఆంక్షలు విధించారు.     


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని