close

తాజా వార్తలు

Published : 13/08/2020 22:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గోదావరిలో క్రమంగా పెరుగుతున్న వరద ఉద్ధృతి  

రాజమహేంద్రవరం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 9.4 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. మరోవైపు బ్యారేజీ నుంచి 4.995 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బుధవారం విడుదల చేసిన 2.25 లక్షల క్యూసెక్కుల నీటితో పోలిస్తే ఇది రెట్టింపు కన్నా అధికం. వరద ప్రవాహానికి గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదులు జలకళను సంతరించుకున్నాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో లంక భూముల్లోకి నీరు వచ్చి చేరుతోంది.

జలాశయాలకు జలకళ...

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భూపతిపాలెం, ముసురుమిల్లి, మద్దిగడ్డ, సూరంపాళెం జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. భూపతిపాలెం జలాశయం నిల్వ సామర్థ్యం కన్నా నీరు చేరడంతో ఓ గేటు ఎత్తి 155 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న సీతపల్లి వాగులోకి విడుదల చేశారు. గోదావరి పోర్టుకు ఒడ్డున ఉన్న గ్రామాల్లో రాకపోకలు స్తంభించాయి. దేవీపట్నం, కె.వీరవరం, తొయ్యేరు జలదిగ్బంధం అవ్వగా ప్రజలు భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నారు. వీరిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వేలోకి వరద నీరు

గోదావరిలో వరద ప్రవాహం పెరగడంతో పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని కొత్తూరు కడెమ్మ వంతెనపైకి వరదనీరు చేరింది. దీంతో మండలంలోని 9 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం స్పిల్‌వే ఛానల్‌లోకి వరద నీరు వచ్చి చేరింది. దేవీపట్నం మండలం పూడిపల్లి వద్ద గోదావరి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. 

ప్రమాద స్థాయిలో డుడుమా జలాశయం..

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ మన్యంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆంధ్రా-ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి నీరందించే డుడుమా జలాశయం ప్రమాదస్థాయికి చేరింది. 2,590అడుగుల సామర్థ్యం గల ఈ జలాశయంలో ప్రస్తుతం 2589.9 అడుగులమేర వరద నీరు వచ్చి చేరింది. దీంతో 2000క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.