
తాజా వార్తలు
కుమురంభీం: పెద్దపులి దాడిలో బాలిక మృతి
భయాందోళనలో 6 గ్రామాల ప్రజలు
పెంచికలపేట: కుమురం భీం జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. చేనులో పత్తి ఏరుతున్న బాలికపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన జిల్లాలోని పెంచికలపేట మండలం పరిధిలోని కొండపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండపల్లికి చెందిన పసుల నిర్మల (16) గ్రామానికి చెందిన అన్నం సత్తయ్య అనే రైతు పొలంలో పత్తి తీసేందుకు వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో పొదల మాటున దాగి ఉన్న పులి ఒక్కసారిగా నిర్మలపై దాడి చేసి 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. అది గమనించిన చక్రవర్తి అనే యువకుడు పులిపై కర్రను విసరడంతో నిర్మలను వదిలేసి అక్కడనుంచి పారిపోయింది. బాలిక ఘటనాస్థలంలోనే మృతి చెందింది. స్థానికులు అందించిన సమాచారంతో పెంచికలపేట అటవీ రేంజ్ అధికారి వేణుగోపాల్, ఎస్సై రమేశ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
జిల్లా పరిధిలోని దహేగాం మండలం దిగడలో కొన్ని రోజుల క్రితం పులి దాడిలో విఘ్నేశ్ అనే యువకుడు మృతి చెందాడు. తాజా సంఘటన జరిగిన కొండపల్లి గ్రామానికి
సమీపంలోనే దహేగాం గ్రామం ఉంది. అయితే రెండు ఘటనల్లో దాడికి పాల్పడింది ఒకే పులి అయిఉండవచ్చనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. తాజా సంఘటనతో చుట్టుపక్కల గ్రామాలైన అగుర్గుడా, గుండేపల్లి, కమ్మరుగాం, నందిగాం, జిల్లెడ, మురళీగూడ గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సాధ్యమైనంత త్వరగా పులిని పట్టు్కోవాలని గ్రామాల ప్రజలు అటవీ అధికారులను కోరుతున్నారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
- ముక్క కొరకలేరు!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
