రహానె నువ్విలా చెయ్‌: గంభీర్‌
close

తాజా వార్తలు

Updated : 23/12/2020 03:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రహానె నువ్విలా చెయ్‌: గంభీర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: మరో నాలుగు రోజుల్లో ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే రెండో టెస్టుకు ముందు కెప్టెన్‌ అజింక్య రహానెకు మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ పలు సలహాలు, సూచనలు చేశాడు. ఇప్పటికే విరాట్‌ కోహ్లీ పితృత్వపు సెలవులపై భారత్‌కు తిరిగి ప్రయాణమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రహానె రెండో టెస్టు నుంచి సారథ్య బాధ్యతలు అందుకోనున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ‘బాక్సింగ్‌డే టెస్టు’లో భారత్‌ రాణించాలంటే ఏం చేయాలనే విషయాలపై గంభీర్‌ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ.. తొలుత రహానె నాలుగో స్థానంలో ఆడాలని సూచించాడు. అతడి కన్నా ముందు శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌, హనుమ విహారిని పంపిస్తే బాగోదని, అది మరోలా ప్రభావం చూపుతుందని పేర్కొన్నాడు. 

అలాగే అతడు ఐదుగురు బౌలర్లను తీసుకోవాలని, ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఉండాలన్నాడు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రవీంద్ర జడేజా బాగా ఆడగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. అశ్విన్‌కు తోడుగా జడేజాను తీసుకోవాలన్నాడు. ఐదుగురు బౌలర్లతో ఆడితే మళ్లీ ఆస్ట్రేలియాలో భారత్‌ సిరీస్‌ గెలవగలదనే అభిప్రాయం కలిగించాలని గంభీర్‌ సూచించాడు. ఇదిలా ఉండగా, అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ వరకూ పూర్తి ఆధిపత్యం చెలాయించగా, రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా తడబడింది. హేజిల్‌వుడ్‌, పాట్‌ కమిన్స్‌ ధాటికి ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భారత్‌ 36/9కే పరిమితమై టెస్టు చరిత్రలో తన అత్యల్ప స్కోరు నమోదు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 90 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదింది. దీంతో ఆ జట్టు 4 టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో రహానె రెండో టెస్టులో భారత్‌ను ఎలా నడిపిస్తాడో ఆసక్తిగా మారింది. 

ఇవీ చదవండి..

8 జట్లతోనే వచ్చే ఐపీఎల్‌!

36/9 ఊహించలేదు: బుద్ధిని వాడాలి!

వీళ్లేం క్రికెట్‌ పాలకులు?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని