గంభీర్‌ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా
close

తాజా వార్తలు

Published : 07/11/2020 08:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గంభీర్‌ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా

ఐసోలేషన్‌లోకి వెళ్లిన మాజీ క్రికెటర్‌, ఎంపీ

దిల్లీ: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ శుక్రవారం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గంభీర్‌ శుక్రవారం ట్వీట్‌ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. తన పరీక్షల రిపోర్టు రావాల్సి ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని, వైరస్‌ను తేలిగ్గా తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని  ఈ సందర్భంగా గంభీర్‌ సూచించారు.

 ఇటీవల దిల్లీలో కరోనా తగ్గుముఖం పట్టినట్లే కనిపించినా మళ్లీ విజృంభిస్తోంది. గత రెండు రోజుల్లో కేసుల సంఖ్య పెరగడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు శీతాకాలంలో వైరస్‌ ప్రభావం పెరిగే అవకాశం ఉండడంతో అందరూ కచ్చితంగా నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. మరోవైపు గంభీర్‌ 2003 నుంచి 2016 వరకు టీమ్‌ఇండియా క్రికెటర్‌గా కొనసాగాడు. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే మొత్తం 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. అలాగే టీ20 క్రికెట్‌ లీగ్‌లోనూ కోల్‌కతాను రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు భాజపాలో చేరిన ఆయన తూర్పు దిల్లీ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని