ధోనీ లాంటి ఆటగాడిపై వాళ్లే ఒత్తిడి తెస్తారు
close

తాజా వార్తలు

Published : 26/07/2020 12:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధోనీ లాంటి ఆటగాడిపై వాళ్లే ఒత్తిడి తెస్తారు

మాజీ సారథిపై గౌతమ్‌ గంభీర్‌ ఏమన్నాడంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ లాంటి ఆటగాడిపై చాలా మంది నిపుణులు ఒత్తిడి తెస్తారని, అందుకు కారణం అతడి వయస్సేనని మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. స్టార్‌స్పోర్ట్స్‌ క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో శనివారం మాట్లాడిన గౌతీ.. ధోనీ భవిష్యత్‌పై స్పందించాడు. గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత మాజీ సారథి ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విరామం తీసుకున్న ధోనీ మార్చిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్వహించిన శిక్షణ శిబిరంలో పాల్గొన్నాడు. 

ఇక లాక్‌డౌన్‌ వేళ ఐపీఎల్‌పై స్పష్టత లేకపోవడంతో ధోనీ రిటైర్మెంట్‌ వార్తలు కూడా వినిపించాయి. ఒకానొక సందర్భంలో ధోనీ సతీమణి సాక్షి వాటిని ఖండించారు. ఇప్పుడు సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈలో ఈ మెగా టోర్నీ నిర్వహిస్తున్నట్లు స్పష్టత రావడంతో అందరి కళ్లూ చెన్నై సారథిపైనే పడ్డాయి. ఈ నేపథ్యంలో గంభీర్‌ మాట్లాడుతూ వయస్సు అనేది కేవలం సంఖ్యేనని, ఒక ఆటగాడు మంచి ఫామ్‌లో ఉన్నాడని భావిస్తే ఎప్పుడైనా ఆడొచ్చని చెప్పాడు. ధోనీ ఇప్పుడు బాగా ఆడగలననే నమ్మకంతో పాటు మ్యాచ్‌లు గెలిపించే శక్తి ఉందనుకుంటే ఆట కొనసాగించొచ్చని వివరించాడు. అనంతరం ఐపీఎల్‌పై స్పందించిన మాజీ ఓపెనర్‌.. అది ఎక్కడ నిర్వహిస్తున్నారనే విషయం ముఖ్యం కాదన్నాడు. ఆ మెగా టోర్నీ జరిగితే దేశ ప్రజల ఆలోచనా విధానం మారుతుందని పేర్కొన్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని