కోహ్లీ పాకిస్థాన్‌పై 183 కొట్టడమే అసలైన రికార్డు..
close

తాజా వార్తలు

Published : 02/08/2020 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీ పాకిస్థాన్‌పై 183 కొట్టడమే అసలైన రికార్డు..

మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఏమన్నాడంటే

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. ఏ ఫార్మాట్‌లో అయినా, ఏ జట్టు మీదైనా, ఎక్కడైనా పరుగుల వరద పారించగలడు. అండర్‌ 19 స్థాయిలోనే టీమ్‌ఇండియాను విశ్వవిజేతగా నిలిపిన అతడు తర్వాత జాతీయ జట్టులో స్థానం సంపాదించి రికార్డుల మోత మోగిస్తున్నాడు. తన బ్యాటింగ్‌తో పాటు నాయకత్వంతో జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్నో శతకాలు, మరెన్నో రికార్డులు నెలకొల్పుతున్నాడు. ఇక 2012 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 183 పరుగుల ఇన్నింగ్సే అతడి కెరీర్‌లో ‘ది బెస్ట్‌’ అని మాజీ ఓపెనర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా స్టార్‌స్పోర్ట్స్‌ కార్యక్రమంలో మాట్లాడిన మాజీ క్రికెటర్‌ అప్పుడు కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ను ప్రశంసించాడు.

ఫార్మాట్లకు అతీతంగా టీమ్‌ఇండియా సారథి ఎన్నో నమ్మశక్యం కాని ఇన్నింగ్స్‌ ఆడాడని, అందులో అత్యుత్తమైనది పాకిస్థాన్‌పై సాధించిన అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ అని గంభీర్‌ గుర్తుచేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో భారత్‌ 330 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చిందని, తొలి ఓవర్‌లోనే తాను ఔటయ్యాక సచిన్ తెందూల్కర్‌‌(52), రోహిత్‌ శర్మ(68)లతో కలిసి విరాట్‌ (183; 148 బంతుల్లో 22x4, 1x6) జట్టును ఆదుకున్నాడని చెప్పాడు. అప్పట్లో అంత అనుభవం లేకపోయినా కోహ్లీ చిరకాల ప్రత్యర్థి పాక్‌ మీద అతిగొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడని మెచ్చుకున్నాడు. కాగా, ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో 329/6 భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు మహ్మద్‌ హఫీజ్‌(105), జాసిర్‌ జంషెద్‌ (112) శతకాలతో చెలరేగారు. అనంతరం కోహ్లీ రెచ్చిపోడంతో భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 47.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని