టీమ్‌ఇండియా అది గుర్తుంచుకోవాలి: గంభీర్‌
close

తాజా వార్తలు

Published : 24/12/2020 14:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీమ్‌ఇండియా అది గుర్తుంచుకోవాలి: గంభీర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: తొలి టెస్టులో ఘోర పరాజయం తర్వాత టీమ్‌ఇండియా బాధపడి ఉండొచ్చని, అయితే.. అదే మ్యాచ్‌లో తొలి రెండు రోజులు ఆధిపత్యం చెలాయించిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మాజీ ఓపెనర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ పేర్కొన్నాడు. అడిలైడ్‌లో ఆసీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 36/9 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ నేపథ్యంలోనే గంభీర్‌ రెండో టెస్టుకు ముందు భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశాడు. తాజాగా ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

‘భారత్‌ తొలి టెస్టులో రెండు రోజుల పాటు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆ మ్యాచ్‌లో మొత్తం పైచేయి సాధించింది. కానీ, బాగా ఆడని ఒక్క సెషన్‌ వల్లే బాధపడి ఉంటుంది.  ఈ సిరీస్‌లో ఇంకా మూడు టెస్టులు ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, పేసర్‌ మహ్మద్‌ షమి లేకపోవడం బాధాకరం. ఇలాంటి పరిస్థితుల్లో అజింక్య రహానె ఎలాంటి పాత్ర పోషిస్తాడనేదే కీలకంగా మారనుంది. అతడిపై పెద్ద బాధ్యతలు ఉన్నాయి. టీమ్‌ఇండియా రెండో టెస్టు జట్టు కాంబినేషన్ తయారీ ఇప్పుడు ఆసక్తిగా మారింది’ అని గంభీర్‌ అన్నాడు. 

తొలి టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసింది. కెప్టెన్‌ కోహ్లీ(74; 180 బంతుల్లో 8x4) టాప్‌ స్కోరర్‌. అనంతరం బౌలర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా 191 పరుగులకే ఆలౌటైంది. దీంతో కోహ్లీసేనకు తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక రెండో రోజు చివర్లో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ వికెట్‌ నష్టానికి 9 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలోనే మూడో రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన గంటన్నరకే ఆలౌటైంది. 36 పరుగులకు 9 వికెట్లు కోల్పోగా షమి(1) గాయం కారణంగా తప్పుకొన్నాడు. చివరికి ఆస్ట్రేలియా 90 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి విజయం సాధించింది. 

ఇవీ చదవండి..

చాహల్‌-ధనశ్రీ మరిచిపోలేని మధుర జ్ఞాపకాలు..  

కోహ్లీ కోసం ధోనీ త్యాగం.. !

కోహ్లీ స్థానంలో సెహ్వాగ్‌ ఉంటే..?

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని