స్వీయ నిర్బంధంలో గంభీర్‌
close

తాజా వార్తలు

Published : 06/11/2020 23:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్వీయ నిర్బంధంలో గంభీర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా మాజీ ఓపెనర్‌, ప్రస్తుత తూర్పు దిల్లీ ఎంపీ గౌతం గంభీర్‌ స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. తన ఇంట్లో ఒకరికి కరోనా వైరస్‌ సోకడంతో ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించాడు. ‘‘మా ఇంట్లో ఒక కరోనా కేసు రావడంతో ఐసోలేషన్‌లో ఉంటున్నాను. కొవిడ్‌ పరీక్షలు చేయించాను. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాను. అయితే కరోనా పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలి. మహమ్మారిని ఎట్టిపరిస్థితుల్లో తేలికగా తీసుకోవద్దు’’ అని గంభీర్‌ ట్వీటాడు. అతడి ట్వీట్‌పై అభిమానులు స్పందిస్తున్నారు. ఫలితం ఎలా వచ్చినా ధైర్యంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. 39 ఏళ్ల గంభీర్‌ భారత్ తరఫున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 84,11,724 మంది కరోనా వైరస్‌ బారిన పడగా దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 5,20,773గా ఉన్నాయి. 77,65,966 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. నిన్నటితో పోల్చుకుంటే నేడు కేసుల సంఖ్య కాస్త తగ్గాయి. 47,638 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే పండుగల సీజన్, శీతకాలం ప్రారంభం కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళనకు గురవుతున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటించాలంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని