ఇది 14వ శతాబ్దం దిల్లీ కాదు.. 21వ శతాబ్దానిది!
close

తాజా వార్తలు

Updated : 14/08/2020 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇది 14వ శతాబ్దం దిల్లీ కాదు.. 21వ శతాబ్దానిది!

తుగ్లక్‌ పాలన అంటూ గంభీర్‌ సెటైరికల్‌ పంచ్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ దిల్లీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. బుధవారం రాత్రి నుంచీ దేశ రాజధానిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఈ నేపథ్యంలో తుగ్లకాబాద్‌ అనే ప్రాంతంలో రోడ్డుపైనే ఓ చోట భారీ ఎత్తున వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో అక్కడి నుంచీ వేళ్లేవారు కొందరు ఓ ఎద్దులబండిపై ఎక్కారు. నీటి మధ్యలోకి రాగానే గతుకులు ఎదురవడంతో దాని మీదున్న కొందరు నీళ్లలో జారిపడ్డారు. 

ఆ వీడియోను ఓ వార్తా సంస్థ గురువారం ఉదయం ట్వీట్‌ చేయగా, గంభీర్‌ దానిపై స్పందించారు. ‘ఇది 14వ శతాబ్దంలోని తుగ్లక్‌ దిల్లీ కాదు, 21వ శతాబ్దంలోని తుగ్లక్‌ దిల్లీ’ అని విమర్శించి.. ఆ వీడియోను తన ట్విటర్‌లో పోస్టు చేశాడు. మరోవైపు దిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ గురువారం ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నోయిడా, రోహ్‌తక్‌, మెహమ్‌, గురుగ్రామ్‌, ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌లాంటి చోట్ల కూడా వర్షాలు కురుస్తాయని చెప్పింది. అలాగే గతరాత్రి కురిసిన వర్షాలు ఈ సీజన్‌లోనే అత్యధికంగా నమోదైనట్లు పేర్కొంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని