close

తాజా వార్తలు

Updated : 25/09/2020 17:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎస్పీ బాలు స్మృతులు @ 5 PM

1. కోలుకుంటున్నారని సంతోషించా.. అంతలోనే..

గాన గంధర్వుడు, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్విటర్‌లో భావోద్వేగ సందేశాన్ని ఉంచారు. బాలు ఆస్పత్రిలో ఉన్న రోజుల్లో ఆయన ఆరోగ్యంపై వాకబు చేసిన విషయాన్ని వెల్లడిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కోలుకుంటున్నారని తెలిసి సంతోషిస్తున్న తరుణంలోనే ఇలా జరగడం తీవ్ర బాధను కలిగించిందన్నారు. ఒకే ఊరివాడైనందున చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయాన్ని ప్రస్తావిస్తూ.. ఆయన చేసిన కృషిని గుర్తుచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మాటలకందని మహా విషాదం: రామోజీరావు

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వేల పాటలు పాడిన మధుర గాయకుడి మరణం మాటలకందని మహా విషాదమని అన్నారు. ప్రపంచ సంగీతానికే బాలు స్వరం ఓ వరమని అభివర్ణించారు.‘బాలు ఇక లేరంటేనే బాధగా దిగులుగా ఉంది. మనసు మెలిపెట్టినట్టు ఉంది. ఆయన గంధర్వ గాయకుడే కాదు.. నాకు అత్యంత ఆత్మీయుడు. గుండెలకు హత్తుకుని ప్రేమగా పలకరించే తమ్ముడు. తెలుగు జాతికేకాదు ప్రపంచ సంగీతానికే ఆయన స్వరం ఓ వరం’ అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఎస్పీబీ

సృష్టిలో సంగీతానికి ప్రకృతి కూడా పరవశిస్తుంది. దానికున్న సమ్మోహనశక్తి అలాంటిది. ఘంటసాల వంటి ఎందరో మహానుభావులు తెలుగు సినీ సంగీతానికి పునాది వేస్తే, తదనంతరకాలంలో ఆ పునాదిపై సంగీత సౌధాన్ని నిర్మించింది ‘బాలు’ అని ముద్దుగా పిలుచుకొనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆబాల గోపాలాన్ని కట్టిపడేసే సమ్మోనశక్తి బాలు గళానికే కాదు ఆయన వ్యక్తిత్వానికీ ఉంది. సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ప్రస్థానం ప్రారంభించినా, ఆ తర్వాత గాయకుడిగా అజరామరమైన పాటలను ఎన్నో ఆలపించారాయన. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘బాలు మృతితో అద్భుతశకం ముగిసింది’

ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోట్లాది హృదయాలు వేడుకున్నా విధి కరుణించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాలు మరణంతో ఓ అద్భుత సినీశకం ముగిసిందన్నారు. తన గానంతో ప్రజల గుండెల్లో బాలు అజరామరుడిగా ఉంటారని చంద్రబాబు అన్నారు. ఆయన మృతి భారత చలన చిత్ర పరిశ్రమకే కాకుండా కళాకారులు, యావత్‌ సంగీత ప్రపంచానికే తీరనిలోటన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అక్షరమంటే... మాటంటే... భాషంటే ఇష్టం

యాభై ఏళ్లుగా జీవనదిలా ప్రవహిస్తున్న బాలు పాటకు ఆసేతుహిమాచలమంతా అభిమానులే. సాహిత్యాన్ని అర్థం చేసుకుని.. పాట ఆత్మను ఆవాహనం చేసుకుని ఆలపించే అరుదైన గాయకుడిగా ఆయనది ఓ ప్రత్యేక పథం. అంతేనా! ‘పాడుతాతీయగా’తో ఔత్సాహిక గాయనీ గాయకులకు ఓ గురువుగా తన అనుభవ జ్ఞానాన్నీ పంచిపెట్టారు. ఇటీవల ఆయన ‘తెలుగువెలుగు’తో తన అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకున్నారు. మాతృ భాష పట్ల ఉన్న మమకారాన్ని వ్యక్తం చేశారు. బహుశా ఇదే ఆయన పత్రికలకు ఇచ్చిన ఆఖరి ఇంటర్వ్యూ. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. శనివారం ఎస్పీబీ అంత్యక్రియలు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. చెన్నైలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో వీటిని నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా బాలు పార్థివదేహాన్ని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు బాలు మృతికి సంతాపం తెలియజేశారు. లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

7. ఎస్పీబీ నటనా కౌశలం.. మిథునం

చిత్ర పరిశ్రమలో కొందరు అద్భుతంగా నటిస్తారు. ఇంకొందరు డైనమైట్‌లా డైలాగులు పేలుస్తారు. మరికొందరు తనదైన కామెడీతో కితకితలు పెట్టిస్తారు. కానీ అటు గాయకుడిగా మెప్పిస్తూ ఈ మూడింట్లోనూ ప్రతిభ చాటగల వ్యక్తి ఎవరని అనడిగితే ఠక్కున వచ్చే సమాధానం శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం. అందరూ ముద్దుగా పిలుచుకునే ఎస్పీ బాలు. అటు గాయ‌కుడిగా, ఇటు డబ్బింగ్‌ ఆర్టిస్టుగానే కాదు.. అనేక చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించారాయన. తండ్రి పాత్రల్లో ఒదిగిపోయారు. కామెడీతో అలరించారు. అసలు బాలు గాయకుడు కాకముందే నటుడిగా వెండితెరకు పరిచయం కావడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బాలుని స్టూడియోలోకి రానీయలేదు!

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తొలిపాట పాడింది ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న కథ’ (1966)లో. సంగీత దర్శకుడు కోదండపాణి పాట రిహార్సల్సు చేయించి, ఫలానారోజు ఉదయం ‘‘విజయగార్డెన్స్‌లో రికార్డింగు’’ అని రమ్మన్నారట.. మురళి అనే స్నేహితుడు సైకిలు తొక్కుతుండగా.. వెనకాల కూర్చుని, బాలు విజయగార్డెన్స్‌కి వెళ్తే సెక్యూరిటీ వాళ్లు లోపలికి పంపలేదట. ‘‘రికార్డింగు వుంది. నేనే పాడాలి’’ అని ఎస్పీబీ చెప్తే..పీలగావున్న కుర్రాడు పాడటమేంటని ద్వారపాలకుడు ‘నో’ అన్నాడట. అప్పుడు మురళి..‘‘పెద్ద వాళ్లని పిలుచుకొని వస్తాను’’ అని లోపలికి వెళ్లాడు. ఆ తర్వాత రికార్డింగ్‌ సహాయకుడు, సంగీత సహాయకుడూ బయటికి వచ్చి బాలుని లోపలికి తీసుకెళ్లారట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భువిలో సంగీతం ఉన్నంత కాలం బాలు అమరులే..

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేశారు. కె. రాఘవేంద్రరావు, ఎ.ఆర్‌. రెహమాన్‌, అక్షయ్‌ కుమార్‌, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, రవితేజ, నాని, తమన్‌, మంచు లక్ష్మి, దుల్కర్‌ సల్మాన్‌ తదితరులు సంతాపం తెలిసిన వారిలో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘దేవుడు వరమిస్తే జీవించాలనే కోరుకుంటా’

జీవితమంటే తనకెంతో ఇష్టమని, ఒకవేళ భగవంతుడు కనుక వరమిస్తే ఎంతకాలమైనా జీవించాలనే కోరుకుంటానని ఒకానొక సందర్భంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఇటీవల కరోనా నుంచి కోలుకుని.. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో ఇబ్బందిపడుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. అయితే జీవితంపై తనకున్న ఇష్టం గురించి బాలు ఓ ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.