close

తాజా వార్తలు

Updated : 08/08/2020 09:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. లోయలో పడ్డ విమానం

కేరళలోని కొజికోడ్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. గమ్యస్థానానికి చేరుకున్న ‘ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌’ విమానం అనూహ్యంగా అదుపుతప్పి, 35 అడుగుల లోయలో పడింది. ఇందులో 19 మంది చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఇద్దరు పైలట్లు, ఐదుగురు క్యాబిన్‌ సిబ్బంది, పది మంది చిన్నారులు సహా 174 మంది ప్రయాణికులతో దుబాయ్‌ నుంచి వచ్చిన బోయింగ్‌ 737 (ఫ్లైట్‌ ఐఎక్స్‌ 1344) విమానం శుక్రవారం రాత్రి 7.41 గంటలకు కొజికోడ్‌ విమానాశ్రయంలో దిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణలో కొత్తగా 2,256 కేసులు

 తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,256 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య,ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,513కి చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 14 మంది ప్రాణాలు కోల్పోవడంతో.. మొత్తం మృతుల సంఖ్య 615కి పెరిగింది. తాజాగా కొవిడ్‌ నుంచి 1,091 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 54,330గా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మరో 10 లక్షల యాంటిజెన్‌ కిట్లు

3. ఆంధ్రప్రదేశ్‌ కోసమే అమరావతి

ఆంధ్రప్రదేశ్‌కు ఆదాయాన్ని అందించే కామధేనువే అమరావతి అని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. ‘అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్‌ అనేది సరి కాదు.. ఆంధ్రప్రదేశ్‌ కోసమే అమరావతి’ అని స్పష్టం చేశారు. ‘అభివృద్ధి వికేంద్రీకరణలో భాగమే అమరావతి. అదో స్వయంసమృద్ధి ప్రాజెక్టు. పైసా ఖర్చు పెట్టకుండా అందులో వచ్చే డబ్బుతోనే ప్రాజెక్టును పూర్తి చేస్తే భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది’ అని చెప్పారు. ‘33 వేల ఎకరాలు ఎందుకంటున్నారు? రైతులకిచ్చే స్థలాలు, రోడ్లు, ప్రజావసరాలకు పోను 8వేల నుంచి 9వేల ఎకరాలు ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఏ ఎండకు ఆ గొడుగు

4. సెప్టెంబరు 1 నుంచి బడులు

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా మూతపడిన పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలను సెప్టెంబరు 1 నుంచి నవంబరు 14 మధ్య దశల వారీగా పునః ప్రారంభించేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. పలు దేశాలు విద్యా సంస్థలను తెరిచిన తీరుపై అధ్యయనం సాగించిన మీదట, ఈ విషయమై మార్గదర్శకాలను రూపొందిస్తోంది. అయితే- ఈ విషయంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మహింద రాజపక్స ఘన విజయం

 శ్రీలంక రాజకీయాల్లో రాజపక్స కుటుంబం మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ దేశ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఆ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నడిచే శ్రీలంక పీపుల్స్‌ పార్టీ(ఎస్‌ఎల్‌పీపీ) భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం స్థానాల్లో మూడింట రెండువంతులు ఆ పార్టీకే దక్కాయి. 225 స్థానాలున్న పార్లమెంటులో ప్రధాన మంత్రి మహింద రాజపక్స నేతృత్వంలోని ఎస్‌ఎల్‌పీపీ, దాని మిత్రపక్షాలు 150 స్థానాల్లో విజయ ఢంకా మోగించాయి. ఎస్‌ఎల్‌పీపీకి సొంతంగా 145 స్థానాలు దక్కటం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చైనాతో ఒక పార్టీ ఒప్పందమా!

చైనా కమ్యూనిస్టు పార్టీతో 2008లో కాంగ్రెస్‌ ఒప్పందం కుదుర్చుకుందని, దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)తో సమగ్ర విచారణ జరిపించాలంటూ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. కావాలంటే హైకోర్టును ఆశ్రయించుకోవచ్చని పిటిషనర్లకు సూచించింది. ‘‘మీరు కోరుతున్న ఊరటలు హైకోర్టు ఇవ్వొచ్చేమో’’అని పిల్‌ను తిరస్కరిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఏ. బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కరోనా టీకా.. మాకే ముందుగా

‘కరోనా’ టీకా... ఎప్పుడెప్పుడు వస్తుందా...? అని ప్రపంచం అంతా ఎదురుచూస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ప్రాథమిక స్థాయి ప్రయోగాల్లో సత్ఫలితాలు రావటంతో చాలా దేశాల్లో ఔషధ కంపెనీలు, పరిశోధన సంస్థలు ‘కరోనా’ టీకాపై మానవ ప్రయోగాలు చేపట్టాయి. ఈ ప్రయత్నాలను చూస్తే.... టీకా త్వరలోనే వస్తుందనే ఆశాభావం కలుగుతోంది. టీకా అందుబాటులోకి రాగానే దాని కోసం అన్ని దేశాలు, అన్ని వర్గాల ప్రజలు పోటీ పడటం ఖాయం. ఈ నేపథ్యంలో ముందుగా టీకా ఎవరికి అందించాలి, ఎటువంటి వారికి ప్రాధాన్య మివ్వాలి.. అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇటువంటి ఆలోచన రావటం వల్లనే కావచ్ఛు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మలిసంధ్య విజయం

8. చదివిస్తామని.. పెళ్లిచేస్తామని..

అభం శుభం తెలియని బాలికలనూ కేటుగాళ్లు వదలడం లేదు. పెంచుకుంటామంటూ.. చదివిస్తామంటూ.. పెళ్లి చేస్తామంటూ తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఇక్కడికి తీసుకొస్తున్నారు. కాసుల కక్కుర్తితో వ్యభిచారం రొంపిలోకి దింపుతున్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నాలుగేళ్లలో 101 మంది మైనర్లను ఈ కూపం నుంచి రక్షించారంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్ఛు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

9. ఆ విషయాల్లో ఎస్వీఆర్‌... కమల్‌హాసన్‌లే స్ఫూర్తి

‘‘పదేళ్లు సినిమాల్ని వదిలేసి వెళ్లిపోయినా నాకింకా ఆకలి తీరలేదు. ఇప్పుడు అనేక వైవిధ్యభరిత పాత్రలతో ప్రయాణం చేస్తున్నా. నటుడిగా నా పనిని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నా. అందుకే మరో పదేళ్ల దాకా నటన నుంచి పక్కకు దృష్టి సారించాలనుకోవట్లేదు. దర్శకత్వం చెయ్యాలన్న కోరిక లేదు’’ అన్నారు సీనియర్‌ నటుడు నరేష్‌. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ‘శతమానం భవతి’,‘సమ్మోహనం’, ‘రంగస్థలం’ లాంటి చిత్రాల్లో విభిన్న పాత్రలతో అలరించిన ఆయన.. ఇప్పుడు ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంలో బాబ్జీగా చక్కటి అభినయంతో మరోసారి మెప్పించారు. సత్యదేవ్‌ కథానాయకుడిగా వెంకటేశ్‌ మహా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో ముచ్చటించారు నరేష్‌. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

10. మహిళల ప్రపంచకప్‌ వాయిదా

వచ్చే రెండేళ్లలో నిర్వహించబోయే ప్రధాన టోర్నీలైన ప్రపంచకప్‌ల విషయంలో సందిగ్ధతకు ఐసీసీ తెరదించింది. వచ్చే ఏడాది భారత్‌లోనే టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. 2022లో ఆసీస్‌లో ఆ పొట్టి క్రికెట్‌ కప్పు కోసం జట్లు పోటీపడనున్నాయి. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌లో జరగాల్సిన మహిళల వన్డే ప్రపంచకప్‌ను ఐసీసీ ఏడాది పాటు వాయిదా వేసింది. శుక్రవారం బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.