close

తాజా వార్తలు

Published : 03/08/2020 08:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. పల్లెలూ... బహుపరాక్‌!

కరోనా మహమ్మారి పల్లెల వైపు కోరలు చాస్తోంది. ఆరు వారాల కిందట రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ, పరిసరాల్లోని మూడు జిల్లాలు మినహా మరెక్కడా పెద్దగా జాడ లేని కొవిడ్‌ ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ జడలు విప్పుతోంది. ఇప్పటికే దాదాపు 270 మండలాలు, సుమారు 1,500 గ్రామాల్లోకి వైరస్‌ వ్యాప్తి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. రాష్ట్రంలో రోజుకు సుమారు 1,800-2,000 వరకూ కరోనా కేసులు నమోదవుతుండగా జీహెచ్‌ఎంసీ (సుమారు 500-600)లో కంటే జిల్లాల్లోని కేసులే 1,300-1,400 వరకూ ఉంటుండడం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

హఠాత్తుగా ఆపద

2. పాంగాంగ్‌పై చైనా తొండి

తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి బలగాలను ఉపసంహరించి, శాంతిని పునరుద్ధరిద్దామంటూ చైనా చెబుతున్న మాటల్లో నిజాయితీ కనిపించడంలేదు. సైన్యాన్ని వెనక్కి తీసుకునే విషయంలో నిబద్ధతను ప్రదర్శించడంలేదు. పాంగాంగ్‌ ప్రాంతంలో తన బలగాలను కొనసాగిస్తోంది. అక్కడి ప్రతిష్టంభనపై భారత్‌తో చర్చించేందుకూ ఇష్టపడటంలేదు. ఎల్‌ఏసీని ఏకపక్షంగా మార్చాలన్న ఆ దేశ దుర్బుద్ధికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఫలితంగా భారత్‌, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అయోధ్యలో దక్షిణాది సంప్రదాయం

పల్లకీలో దేవ దేవేరీల ఊరేగింపు... వీధుల్లో  సాగే ఆ ఊరేగింపు ముందు.. మనసును ఆధ్యాత్మిక డోలికల్లో ముంచెత్తే  మంగళ  వాద్యాలు. దక్షిణాదిలో కనిపించే ఈ సంప్రదాయం ఉత్తర భారత్‌లోని అయోధ్యలోనూ వందేళ్లకు పైబడి కొనసాగుతుండడం విశేషం. సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలో దాదాపు 5,000 ఆలయాలున్నాయి. తెల్లవారుజామునుంచే శ్రీరామ భక్తుల సందడి మొదలవుతుంటుంది. ఇక్కడి మందిరాల్లో అనేక విశిష్టతలుంటాయి. వీటిలో దక్షిణ భారత సంప్రదాయ విధానంలో పూజలు జరిపే ఆలయాలు రెండున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

4. పాల కల్తీ గుట్టు పసిగట్టు

పాల నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కొందరు వ్యాపారులు పాలలో అనేక రకాల రసాయనాలు, గంజిపొడి వంటివి కల్తీ చేస్తున్నారు. నిల్వ పాల అమ్మకాలూ ఎక్కువగా జరుగుతున్నాయి. వినియోగదారులు కల్తీని తెలుసుకోడానికి పశుసంవర్థకశాఖ అధునాతన పరిజ్ఞానంతో రిఫరల్‌ పాల ప్రయోగశాలలను ఏర్పాటుచేయనుంది. ప్రజలెవరైనా వీటికి పాలను తీసుకెళ్లి నాణ్యతను పరీక్షించుకోవచ్చు. ఒకవేళ కల్తీ ఉందని తేలితే పాలు అమ్మిన వారిపై కేసులు పెట్టి శిక్ష పడేలా చేయవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

5. రైతులకిచ్చిన హామీలకు సర్కారుదే పూచీ

పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు చట్ట రూపం దాల్చినప్పటికీ న్యాయసమీక్షకు లోబడే ఉంటాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాకే రాజధాని అమరావతికి రైతులు వేల ఎకరాల భూములనిచ్చారని అంటున్నారు. రాజధాని నిర్మిస్తామని, ప్రగతి పనులు చేపడతామని హామీనిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తగ్గడానికి వీల్లేదని, ఓ తీర్పులోనూ సుప్రీంకోర్టు ఈ మేరకు స్పష్టతనిచ్చిందని గుర్తు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

భూములివ్వడమే మేం చేసిన తప్పా?

6. అన్నను చేరలేక.. తమ్ముడిని చూడలేక!
ఏడు సముద్రాల ఆవల ఉన్నా ప్రతి ఏటా రాఖీ పండగకి సోదరులను కలవాలనేది అక్కాచెల్లెళ్ల ఆశ. ఇప్పుడు ‘అన్నను చేరలేం.. తమ్ముడిని చూడలేం..ఎవరి ఇంట్లో వాళ్లు బందీలవ్వాల్సిన పరిస్థితి’ అంటూ పలువురు వాపోతున్నారు. ఊహ తెలిసిన నుంచి అన్నదమ్ముల బాగు కోరి కట్టే రక్షాబంధనం ఈ ఏడాది చాలామందికి దూరమైంది. వైరస్‌ వల్ల సోదరులను, సోదరిలను కోల్పోయిన వారూ ఉన్నారు. ఇంకొందరు క్వారంటైన్‌లో ఉండి తోబుట్టువులను చేరలేక బాధపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

7. వద్దు సార్‌.. అతడు జట్టును చెడగొడతాడు

 ‘వద్దు సార్‌.. అతడు జట్టును చెడగొడతాడు’.. ఓ స్టార్‌ ఆటగాణ్ని జట్టులోకి తీసుకుందామని చెన్నై సూపర్‌కింగ్స్‌ యజమాని శ్రీనివాసన్‌ అన్నప్పుడు.. ఆ జట్టు కెప్టెన్‌ ధోని స్పందనిది. ఓ వెబినార్‌లో మాట్లాడుతూ శ్రీనివాసనే ఈ విషయం చెప్పాడు. ‘‘చెన్నై సూపర్‌కింగ్స్‌లోకి తీసుకోవడం కోసం ఓ అగ్రశ్రేణి ఆటగాడి పేరును ధోనీకి మేం సూచించా. ‘వద్దు సార్‌.. అతడు జట్టును చెడగొడతాడు’ అని అతడు అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

8. కర్ణాటక ముఖ్యమంత్రికీ కరోనా

దేశంలోని పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పలకూ పాజిటివ్‌ వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏకైక మహిళా మంత్రి కమల్‌ రాణి వరుణ్‌ ఆదివారం కొవిడ్‌-19తో కన్నుమూశారు. మరోవైపు కరోనా చికిత్స పొందిన అగ్రనటుడు అమితాబ్‌ బచ్చన్‌ ముంబయిలోని నానావతి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

9. మృతదేహంతో వైరస్‌ వ్యాపించదు

కరోనా సోకి ఎవరైనా చనిపోతే అపోహలతో వారి అంత్యక్రియలను అడ్డుకోవడం సంస్కారం కాదని షికాగో(అమెరికా)లోని ఇల్లినాయిస్‌ వర్సిటీ అంటువ్యాధుల వైద్యనిపుణులు డాక్టర్‌ విజయ్‌ ఎల్దండి అన్నారు. మృతదేహాలతో కరోనా వ్యాపించదన్న వాస్తవాన్ని అంతా గమనించాలని ఆయన సూచించారు. దీనిపై అనవసర భయాందోళనలు వద్దని, ప్రజలు మానవత్వంతో మసలాలని కోరారు. నిబంధనలను విధిగా పాటించాలన్నారు. కరోనా కారణంగా చనిపోయిన వారి మృతదేహాలను కొన్ని గ్రామాల్లో అడ్డుకుంటున్న విషయం మీడియా ద్వారా తెలుసుకున్న డా.విజయ్‌ స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

10. ఆ తేదీల్లోనే.. అక్కడే

యూఏఈలో ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ నిర్వహణపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. ఆదివారం నాటి ఐపీఎల్‌ పాలక మండలి సమావేశంలో లీగ్‌ తేదీలను ఖరారు చేశారు. అనుకున్నట్లే యూఏఈలో సెప్టెంబరు 19 ఆరంభమయ్యే లీగ్‌.. నవంబరు 10 ముగుస్తుంది. పూర్తి షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించే అవకాశముంది. ఐపీఎల్‌ స్పాన్సర్స్‌లో ఎలాంటి మార్పూ లేదు. చైనా కంపెనీల స్పాన్సర్‌షిప్‌ను కొనసాగించాలని ఐపీఎల్‌ పాలక మండలి నిర్ణయించింది. మహిళల ఐపీఎల్‌నూ ధ్రువీకరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.