close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 16/07/2020 08:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. హైదరాబాద్‌ తూర్పున ఐటీ వెలుగులు

హైదరాబాద్‌ నగరం నలుమూలలా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇందుకోసం త్వరలో గ్రిడ్‌ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. హైదరాబాద్‌ తూర్పు ప్రాంతంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు మౌలిక వసతులను కల్పిస్తామని చెప్పారు. పారిశ్రామిక స్థలాలను ఐటీ పార్కులుగా అభివృద్ధి చేసి, 25 లక్షల చదరపు అడుగుల మేరకు ఐటీ పార్కులు, కార్యాలయాలకు అవసరమైన స్థలాలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. దీనివల్ల ఉప్పల్‌ ప్రాంతంలో మరో 30,000 మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్‌ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలు దూర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతే ఆ స్థలాలను ఐటీ కార్యాలయాలకు ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కొత్త జిల్లాలపై కమిటీ

జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రత్యేక కమిటీని నియమించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఇసుక వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనుంది. రొయ్యలు, చేపల మేత నాణ్యత నియంత్రణకు చట్టం చేయాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య విలేకర్లకు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటయ్యే కమిటీ ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల సంఖ్యను 25 లేదా 26కి పెంచేందుకు అవసరమైన విధివిధానాల్ని రూపొందిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్లాస్మా కావలెను!

కరోనా వైరస్‌ తీవ్రతకు ఆరోగ్యం క్షీణించిన వారిలో ప్రయోగాత్మకంగా అందిస్తోన్న ‘ప్లాస్మాథెరపీ’కి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. అయితే ప్లాస్మా దాతలు తగినంతగా లభించకపోవడం విషమ పరిస్థితికి దారితీస్తోంది. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు రాష్ట్రంలో పెద్దసంఖ్యలోనే ఉన్నా అవసరాలకు తగ్గట్లుగా ప్లాస్మా లభించడం లేదు. దీంతో దాతలు ముందుకు రావాలని కోరుతూ బాధితుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. తమ వారిని బతికించుకోవడం కోసం దాతలకు ఎంతైనా చెల్లించడానికి బాధిత కుటుంబాలు ముందుకొస్తున్నాయి. ప్రాణదాతలుగా గొప్ప దాతృత్వాన్ని ప్రదర్శించాల్సిన సమయంలో.. బాధితుల బలహీనతను కూడా కొందరు సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పశువుల మేత భూముల్లో ఇళ్ల స్థలాలా?

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కోసం భూసేకరణ, స్థలాల కేటాయింపు విషయంలో కొన్ని ప్రాంతాల్లో అధికారులు అనుసరిస్తున్న తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. రెవెన్యూ బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ ప్రకారం పశువుల మేత కోసం కేటాయించిన భూములు, నదులు, చెరువులు, కుంటల తీర ప్రాంతాల్ని ఇతర అవసరాలకు మార్చడం నిషేధమని స్పష్టంచేసింది. ఆ భూముల్ని ఇళ్ల స్థలాలుగా మార్చే అధికారం ఎక్కడుందని నిలదీసింది. బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్స్‌కు విరుద్ధంగా జీవో ఎలా జారీ చేస్తారని ప్రభుత్వ న్యాయవాది సుభాష్‌ను ప్రశ్నించింది. ఇళ్ల స్థలాలిచ్చే పేరుతో అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారో మాకు తెలుసని వ్యాఖ్యానించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇంటర్‌నెట్‌ వాడుతున్నారా? జర పైలం!

కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా అంతర్జాలం (ఇంటర్‌నెట్‌) వినియోగం అధికమవడంతో దాని మాటున సైబర్‌ నేరాలు కూడా గణనీయంగా పెరిగాయని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. వీటి బారినపడకుండా ఉండేలా చిన్నారులు, మహిళలను చైతన్యపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో తలపెట్టిన వినూత్న ఆన్‌లైన్‌ అవగాహన కార్యక్రమం ‘సైబ్‌హర్‌’ను బుధవారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలలో పాటించాల్సిన జాగ్రత్తలు, ఎదురయ్యే ప్రమాదాలు, జరిగే నేరాలను ఎలా అధిగమించాలనే విషయాలపై మహిళలు, చిన్నారులకు అవగాహన కలిగించేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ పోలీసుశాఖ ఈ వినూత్న కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నిత్య విద్యార్థిలా నైపుణ్యాలు నేర్చుకోవాలి

ఎన్ని చదువులు చదివిన వారైనా జీవితంలో నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంపై దృష్టిసారించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. నైపుణ్య భారత్‌ దినోత్సవం (స్కిల్‌ ఇండియా డే) సందర్భంగా ఆయన బుధవారం యువతను ఉద్దేశించి మాట్లాడారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో మన అవసరం ఉండాలంటే స్కిల్‌, రీస్కిల్‌, అప్‌స్కిల్‌ సూత్రాన్ని అనుసరిస్తూ పోవాలని సూచించారు.  ‘‘కరోనా సంకట సమయంలో పని సంస్కృతితోపాటు ఉద్యోగ విధానమూ మారిపోయింది. నిత్యనూతన సాంకేతిక పరిజ్ఞానంపై దీని ప్రభావం చాలా ఉంది. అందువల్ల కొత్త పని సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని యువత నైపుణ్యాలు నేర్చుకోవాలి. ఈ రోజుల్లో వ్యాపారాలు, మార్కెట్లు ఊహించనంత వేగంగా మారుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రూ.399కే ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ కిట్‌

కరోనా పరీక్షల ఖర్చును గణనీయంగా తగ్గించే ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ కిట్‌ను దిల్లీ ఐఐటీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కొరోష్యూర్‌ పేరుతో 9 మంది దిల్లీ ఐఐటీ పరిశోధక విద్యార్థులు రూపొందించిన ఈ కిట్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌, సహాయమంత్రి సంజయ్‌ ధోత్రే, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్‌ఖరే, దిల్లీ ఐఐటీ డైరెక్టర్‌ వి.రామ్‌గోపాల్‌రావు బుధవారం ఇక్కడ విడుదల చేశారు. ఐసీఎంఆర్‌ ఆమోదం పొందిన ఈ టెస్ట్‌ కిట్‌ను న్యూటెక్‌ మెడికల్‌ డివైజెస్‌ సంస్థ ద్వారా మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఆ సంస్థ నెలకు 20 లక్షల కిట్లు ఉత్పత్తి చేయనుంది. కిట్‌ ప్రాథమిక ధర రూ.399గా నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రిలయన్స్‌ శంఖారావం

పెట్రో రసాయన వ్యాపారం నుంచి అధునాతన ఇంధనమైన డేటా సేవలతో దేశీయ టెలికాం రంగ ముఖచిత్రాన్నే మార్చిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 43వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) బుధవారం దృశ్యమాధ్యమ విధానంలో సరికొత్తగా జరిగింది. ఆర్‌ఐఎల్‌ వ్యవస్థాపకులు ధీరూభాయ్‌ అంబానీ 1985లో, కోపరేజ్‌ ఫుట్‌బాల్‌ మైదానంలో 12,000 వాటాదార్లతో ఏజీఎం నిర్వహించడం సంచలనమే అయ్యింది. ఇప్పుడు కొవిడ్‌-19 నేపథ్యంలో, సంప్రదాయ పద్ధతిలో మదుపర్ల సమావేశం జరపలేకపోయినా, జియో మీట్‌ సాయంతో అంతకన్నా ఘనంగా దశ్యమాధ్యమ విధానంలో తొలిసారిగా నిర్వహించారు. 48 దేశాల్లోని 550 నగరాల నుంచి 3.20 లక్షల మంది వాటాదార్లు ఈ సమావేశాన్ని వీక్షించినట్లు సంస్థ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఐపీఎల్‌ కోసం ఇంగ్లాండ్‌తో సిరీస్‌ వాయిదా!

ఐపీఎల్‌కు ముహూర్తం త్వరలోనే ఖరారు కానుందా? టీ20 ప్రపంచకప్‌ ఈ ఏడాది నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో బీసీసీఐ లీగ్‌ నిర్వహణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. సెప్టెంబరు ఆఖరులో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను వాయిదా వేయనున్నట్లు సమాచారం! పరిమిత ఓవర్ల సిరీస్‌ (మూడేసి వన్డేలు, టీ20లు) కోసం సెప్టెంబర్‌లో ఆ జట్టు భారత్‌కు రావాల్సి ఉంది. 16న సిరీస్‌ షురూ కావాలి. కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో ఇంగ్లాండ్‌ పర్యటన వాయిదా పడే అవకాశం ఉందని చెబుతున్నప్పటికీ అసలు కారణం ఐపీఎల్‌ అని తెలుస్తోంది. వచ్చే నెలలో న్యూజిలాండ్‌- ఎ జట్టుతో స్వదేశంలో జరగాల్సిన మ్యాచ్‌లు కూడా వాయిదా పడనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దిల్‌రాజు నిర్మాతగా హిందీ ‘హిట్‌’

తెలుగులో విజయవంతమైన ‘హిట్‌’ హిందీలో రీమేక్‌ కాబోతోంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు బాలీవుడ్‌ నిర్మాత కుల్‌దీప్‌ రాఠోడ్‌తో కలిసి నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్‌ రావ్‌ హీరోగా నటిస్తారు. తెలుగులో చిత్రాన్ని తెరకెక్కించిన శైలేష్‌ కొలను, హిందీలోనూ దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2021లో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకు వెళతారు. దర్శకుడు శైలేష్‌ కొలను మాట్లాడుతూ ‘‘సినిమాలో కథానాయకుడు తన గతం, వర్తమానానికి సంబంధించిన మానసిక సంఘర్షణని అనుభవిస్తుంటాడు. ఇలాంటి పాత్రని పరిణతి చెందిన నటుడు చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న తరుణంలో రాజ్‌కుమార్‌ రావ్‌ నటించడానికి ఒప్పుకొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.