close

తాజా వార్తలు

Published : 07/07/2020 08:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. డ్రాగన్‌ వెనక్కి తగ్గెన్‌!

తీవ్ర ఉద్రిక్తతలతో యుద్ధం అంచుల వరకూ వెళ్లిన భారత్‌, చైనాలు ఎట్టకేలకు శాంతి మంత్రాన్ని జపించాయి. ఇరు దేశాల మధ్య వేడి చల్లారుతున్న సంకేతాలు తొలిసారిగా కనపడుతున్నాయి. గల్వాన్‌ లోయలో వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక ఉపసంహరణను చైనా సోమవారం మొదలుపెట్టింది. సరిహద్దుల్లో తక్షణం బలగాలను వెనక్కి తీసుకొని, ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ మధ్య ఆదివారం జరిగిన టెలిఫోన్‌ చర్చల్లో అంగీకారం కుదిరిన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

చైనాతో గొడవలో మేం భారత్‌ వైపే!

2. ఇక ఆన్‌లైన్‌ పాలన

రాష్ట్రంలో ఆన్‌లైన్‌ పాలన అమల్లోకి రాబోతోంది. ఎలక్ట్రానిక్‌ కార్యాలయం (ఇ-ఆఫీస్‌) సాఫ్ట్‌వేర్‌ ద్వారా రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లో సులభతర పరిపాలన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే వారం నుంచే ఈ విధానం అమలుకానుంది. దీని నిర్వహణకు అవసరమయ్యే ఏర్పాట్లు చేయడంతో పాటు ఉద్యోగుల డిజిటల్‌ సంతకాలు సేకరించాలని వివిధ శాఖలకు ప్రభుత్వం అంతర్గత ఉత్తర్వులు జారీచేసింది. కరోనా నేపథ్యంలో దస్త్రాల నిర్వహణ భౌతికంగా జరగడం ద్వారా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కలవరపెడుతున్న బ్యుబానిక్‌ ప్లేగు

కొవిడ్‌ వ్యాధి పుట్టిన చైనాను మరో భయంకర వ్యాధి కలవరపెడుతోంది. బ్యుబానిక్‌ ప్ల్లేగు తాజాగా వెలుగు చూడడంతో చైనాలో గుబులు మొదలయింది. అక్కడి ఉత్తర ప్రాంతంలోని ఇన్నర్‌ మంగోలియా స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని బయన్నూర్‌ ఆస్పత్రిలో ఒక వ్యక్తికి బ్యుబానిక్‌ ప్లేగు ఉన్నట్లు గుర్తించారు. ఈ నగరంలో ప్లేగు వ్యాధి మరింతగా వ్యాపించే ప్రమాదం ఉన్నట్లు స్థానిక అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది చివరి వరకు అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పరీక్షలు చేస్తారు... సమాచారమివ్వరు!
ప్రభుత్వ ఆధ్వర్యంలోని శాంపిళ్ల సేకరణ కేంద్రాలకు అనుమానితులు పోటెత్తుతున్నారు. ప్రతి చోటా రోజూ 150-200, కొన్ని కేంద్రాల్లో 300 వరకు శాంపిళ్లు సేకరిస్తున్నారు. ముందురోజే టోకెన్లు జారీ చేస్తున్నారు. ఆదివారం మినహా రోజూ మధ్యాహ్నం 2 వరకు సేకరించి ఉస్మానియా వైద్యకళాశాల ల్యాబ్‌కు పంపుతారు. అక్కడినుంచి నగరంలోని వివిధ ప్రభుత్వ ల్యాబ్‌లకు వాటిని చేర్చుతున్నారు. పరీక్ష ప్రక్రియ పూర్తి చేయడానికి గరిష్ఠంగా 8-10 గంటలు పడుతుంది. కొన్నిసార్లు 72 గంటలు దాటుతున్నా అనుమానితులకు ఫలితాల సంగతి తెలియడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. గాలి ద్వారానూ కరోనా

కరోనా మహమ్మారితో ఊహించిన దాని కంటే ఎక్కువ ప్రమాదమే కనిపిస్తోంది. ఈ వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)కు తాజాగా బహిరంగ లేఖ రాశారు. అందుకు సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఐదు మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే సూక్ష్మ తుంపర్లతోనూ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని వారు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పీసీఆర్‌ తప్పుచెప్పినా.. సీటీ స్కాన్‌తో పట్టేయొచ్చు

6. చివరి సెమిస్టర్‌ విద్యార్థులకు పరీక్షలు తప్పనిసరి

వివిధ కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆఖరి సెమిస్టర్‌ పరీక్షలను సెప్టెంబరులోపు జరపాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశించింది. గతంలో ఆ పరీక్షలను జులైలో నిర్వహించాలని సూచించిన యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ).. తాజాగా వాటిని సెప్టెంబరులో జరపాలని చేసిన సూచనలతో ఈ నిర్ణయం తీసుకుంది. తుది పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అని యూజీసీ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రూ.4,800కే మైలాన్‌ రెమ్‌డిసివిర్‌
కొవిడ్‌-19 బాధితుల అత్యవసర చికిత్స కోసం రెమ్‌డిసివిర్‌ జనరిక్‌ ఔషధాన్ని తయారు చేసి, విక్రయించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి పొందినట్లు ఫార్మా దిగ్గజ సంస్థ మైలాన్‌ ఎన్‌వీ సోమవారం ప్రకటించింది. 100 మిల్లీగ్రాముల వయల్‌ (ఇంజెక్షన్‌) రూపంలో తయారు చేసే ఈ ఔషధ ధర రూ.4800 లని, ఈ నెలలోనే ‘డెస్రెమ్‌’ బ్రాండ్‌పై అందుబాటులోకి తెస్తామని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కూరగాయలు, పండ్లతో జాగ్రత్త!

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పండ్లు, కూరగాయల కొనుగోలు, నిల్వ, వినియోగం సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భారత ఆహార భద్రత ప్రమాణాల మండలి (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రజలకు సూచించింది. పండ్లు, కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లలో కొనుగోలు సమయంలో భౌతిక దూరం పాటించాలి. కొన్న తరవాత ఇంటికి తీసుకెళ్లి తినేవరకూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నేను వద్దనుకున్నా

నేను నటిని కావాలని ఎప్పుడూ ఆశ పడలేదు’’ అంటోంది నిత్యా మేనన్‌. ‘సినిమాల్లోకి రావాలి అనుకున్నాక.. తొలినాళ్లలో మీకెదురైన సవాళ్లేంటి? ఎన్ని ఆడిషన్స్‌లో విఫలమయ్యారు?’ అని అడగ్గా ‘‘అసలీ ప్రశ్న నాకు వర్తించద’’ని బదులిచ్చింది నిత్య. ‘‘నాకు మొదటి నుంచీ చదువుపైనే ఆసక్తి ఉండేది. మాస్టర్స్‌ చేయాలి. పీహెచ్‌డీ పూర్తిచేసి, విదేశాలకు వెళ్లిపోయి మంచి ఉద్యోగం చేయాలి... లాంటి ఆలోచనలే ఉండేవి. నటిని కావాలని అసలెప్పుడూ అనుకోలేదు’’ అని చెప్పింది నిత్య. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. క్రికెట్‌ × కరోనా

భారత్‌లో దక్షిణాఫ్రికా వన్డేలు వాయిదా.. శ్రీలంకలో ఇంగ్లాండ్‌ పర్యటన వాయిదా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌ రద్దు.. ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ నిరవధిక వాయిదా.. అక్టోబర్‌లో కంగారూ గడ్డపై ఆరంభం కావాల్సిన టీ20 ప్రపంచకప్‌పై సందిగ్ధత.. ఇలా కొన్ని నెలలుగా ఎక్కడ చూసిన క్రికెట్‌ ప్రతికూల వార్తలే. ఊహించని ఉపద్రవంలా వచ్చిన కరోనా రక్కసి ప్రపంచ క్రికెట్‌ను ముంచెత్తింది. అంతర్జాతీయ సిరీస్‌లు లేక.. దేశీయ టోర్నీలు ఆడే వీల్లేక ఆటగాళ్లతో పాటు అభిమానులూ నిరాశలో మునిగిపోయారు. ఇక ఈ ఏడాదంతా ఇంతేనా అని బాధపడ్డారు. కానీ ఆ సమయంలో ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ఓ చిన్న ఆశ రేకెత్తించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని