close

తాజా వార్తలు

Published : 30/10/2020 16:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. ‘కేంద్రం వాటాపై హరీశ్‌ చెప్పేవి అబద్ధాలే’

తెలంగాణ భవిష్యత్‌కు దుబ్బాక ఉప ఎన్నిక నాంది పలుకుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెరాస, కేసీఆర్‌కు బుద్ధిచెప్పే అవకాశం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా భాజపా అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా భూంపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద నిర్వహించిన సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో దుబ్బాక కీలకపాత్ర పోషించిందని చెప్పారు. తెరాస అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రైతులకు సంకెళ్లు హేయమైన చర్య:దేవినేని

రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు సంకెళ్లు వేసి అరెస్టు చేయడం హేయమైన చర్య అని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు వైకాపా ప్రభుత్వ తీరుపై ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని చెప్పారు. కృష్ణా జిల్లా మైలవరంలో స్థానిక ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి నూజివీడు రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం దేవినేని మీడియాతో మాట్లాడుతూ అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేయడం సీఎం జగన్‌ నిరంకుశతీరుకు అద్దంపడుతోందని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

చెన్నైలో జగన్‌ కొత్త ప్యాలెస్‌: లోకేశ్‌

3. జూటా మాటలు వద్దు: హరీశ్‌రావు

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో భాజపా నేతలు జూటా మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపన్యాసాలు, కరపత్రాలు, సామాజిక మాధ్యమాల్లో గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి హరీశ్‌రావు.. భాజపాపై విమర్శనాస్త్రాలు సంధించారు. భాజపా నేతల ఇళ్లలో డబ్బులు దొరికితే, పోలీసులే డబ్బు పెట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ఆ పార్టీ నేతలకు అసలు ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బ్యాంకులకు కొవిడ్‌ గండం..! 

అసలే మొండి బకాయిలతో కునారిల్లుతున్న బ్యాంకులపై ఇప్పుడు క్రెడిట్‌ కార్డు రుణాల భారం కూడా పడనుంది. కొవిడ్‌-19 కారణంగా తలెత్తిన పరిస్థితులతో భారీ ఎత్తున క్రెడిట్‌ కార్డు రుణాలు ముప్పులో పడ్డాయని ఆర్‌బీఐ ఇచ్చిన ఓ నివేదికలో పేర్కొంది. ఈ మొత్తం దాదాపు రూ.లక్ష కోట్ల వరకు ఉండొచ్చని తెలిపింది. ఇటీవల కాలంలో క్రెడిట్‌ కార్డులు జారీ చేసే సంస్థలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఆయా సంస్థలు అందించే సొమ్ము నాసిరకమైన కస్టమర్లకు వెళుతున్నట్లు గుర్తించాయి. అంటే గతంలో సొమ్ములు ఎగొట్టినవాళ్లు, బకాయిలు ఆలస్యంగా చెల్లించే వారు, రిస్క్‌జోన్‌లో ఉండే వాణిజ్య, కార్పొరేట్‌ కార్డులన్నమాట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. యాంటీ షిప్‌ మిసైల్‌ను ప్రయోగించిన భారత్‌

భారత క్షిపణి ప్రయోగాల పరంపర కొనసాగుతోంది. సరిహద్దు దేశాలతో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ రంగంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చే దిశగా భారత్‌ అడుగులేస్తోంది. ఇటీవల కాలంలో వరుస క్షిపణి ప్రయోగాలు చేపట్టిన భారత్‌.. తాజాగా యాంటీ షిప్‌ మిసైల్‌ (ఏఎస్‌హెచ్ఎం)ను పరీక్షించింది. బంగాళాఖాతంలో యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ కోర నుంచి ఇండియన్‌ నేవీ ఈ ప్రయోగం చేపట్టింది. నిర్దేశిత లక్ష్యాన్ని క్షిపణి సులువుగా ఛేదించిందని వెల్లడించింది. క్షిపణి ఢీ కొట్టడంతో లక్షిత నౌక పేలిపోయి.. పొగలు వస్తున్న ఫోటోను ఇండియన్‌ నేవీ విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అన్నీ అనుకున్నట్టు జరిగితే..టీకా అప్పుడే!

అన్నీ అనుకున్నట్లు జరిగితే..అధిక ప్రమాదం పొంచి ఉన్న అమెరికన్లకు డిసెంబర్ చివరినాటికి లేక జనవరి ప్రారంభంలో టీకా లభించే అవకాశం ఉందని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆశాభావం వ్యక్తం చేశారు. టీకా ఆమోదం కోసం ముందువరసలో ఉన్న మోడెర్నా, ఫైజర్ ఇంక్ సంస్థల తాజా అంచనాల నేపథ్యంలో ట్విటర్, ఫేస్‌బుక్ లైవ్ చాట్‌లో పాల్గొన్న ఆయన ఈ సానుకూల వ్యాఖ్యలు చేశారు. ‘మనకు సురక్షితమైన, ప్రభావవంతమైన టీకా ఉందా?లేదా? అనే విషయం డిసెంబర్‌లో తెలిసే అవకాశం ఉంది. తుది దశకు సంబంధించిన తాత్కాలిక సమాచారం కొన్ని వారాల్లో అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం’ అని ఫౌచీ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘పాక్‌ అంగీకరించింది.. కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలి’

పుల్వామా దాడిలో తమ ప్రమేయం ఉందని పాక్ సీనియర్‌ మంత్రి స్వయంగా అంగీకరించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీపై భాజపా విరుచుకుపడింది. దాడి వెనుక తమ హస్తం ఉందని స్వయంగా పాకిస్థానే అంగీకరించినందున కాంగ్రెస్‌ పార్టీ సహా ఇతర విపక్ష పార్టీలు క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ డిమాండ్‌ చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగిన దాడిలో అధికార పార్టీ కుట్ర ఉందంటూ ఆరోపించిన వారు వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

డ్రాగన్‌ ‘ఆపరేషన్‌ ఫాక్స్‌హంట్‌’ భగ్నం

8. లాక్‌డౌన్‌ దిశగా పలు దేశాలు!

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాప్తి ఆందోళనకర రీతిలో పెరిగిపోతోంది. ఐరోపాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న వేళ అనేక దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ పరిస్థితి వస్తోంది. కొద్దిరోజుల్లో ఐరోపా వ్యాప్తంగా కేసులు వేగంగా పెరిగిపోతాయన్న వైద్యుల హెచ్చరికతో అప్రమత్తమైన ప్రభుత్వాలు ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఫ్రాన్స్‌లో వ్యాపారులు మరో నెలరోజులపాటు కార్యకలాపాలు నిలిపివేసేందుకు నిర్ణయించారు. స్పెయిన్‌లో పలు స్థానిక ప్రభుత్వాలు కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిషేధించాయి. రానున్న రోజుల్లో లండన్‌లో రోజుకు 96 వేలకుపైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కొత్త మాస్క్‌ గురూ.. రాగితో కరోనాకు చెక్‌!

కరోనా‌ వైరస్‌ విజృంభణ నేపథ్యంలో కొత్త కొత్త మాస్క్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ వైరస్‌ వ్యాప్తిని ఎదుర్కోవడమే లక్ష్యంగా శాస్త్రవేత్తలు పరిశోధనలతో కొత్త పరికరాలను రూపొందిస్తున్నారు. తాజాగా కరోనాను ఎదుర్కోవడమే కాకుండా వైరస్‌ను నాశనం చేయగల సామర్థ్యంతో ఓ కొత్త తరహా మాస్కును అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇప్పుడు వాడుతున్న మాస్కులు పరిమిత రక్షణ మాత్రమే కల్పిస్తాయని.. అవి గాలిని శుభ్రం చేసి వైరస్‌ను కట్టడి చేయలేవని మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన పరిశోధకులు వెల్లడించారు. తాము మరింత ముందుకు వెళ్లి రాగి, ఉష్ణోగ్రత ఆధారంగా కరోనా వైరస్‌ను నశింపచేసే మాస్కులను కనిపెట్టినట్టు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. లాభాల్లో ప్రారంభమై.. నష్టాల్లో ముగిశాయ్‌

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు.. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ మార్కెట్లు మరోసారి నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఎన్నికల నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరించడమూ నష్టాలకు కారణమైంది. ఉదయం సూచీలు లాభాల్లో ప్రారంభమైనప్పటికీ.. ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, భారతీ ఎయిర్‌టెల్‌ వంటి ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో వరుసగా మూడో రోజూ నష్టాల్లోకి జారుకున్నాయి. ఒకానొక దశలో 400 పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్‌.. తర్వాత కోలుకుని 135.78 పాయింట్ల నష్టంతో 39,614.07 వద్ద ముగిసింది. నిఫ్టీ 28.4 పాయింట్లు నష్టపోయి 11,642.40 వద్ద స్థిరపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆరోగ్య వనంలో ప్రధాని మోదీ


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.