close

తాజా వార్తలు

Published : 07/08/2020 12:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. కొత్త విద్యావిధానం భావితరాలకు ఉపయుక్తం: మోదీ

నూతన విద్యా విధానం సవాలుతో కూడుకున్నదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. జాతీయ నూతన విద్యావిధానంలో సస్కరణలపై నిర్వహించిన సదస్సులో మోదీ పాల్గొని ప్రసంగించారు. విద్యావిధానంపై నాలుగైదేళ్లుగా అనేక మందితో చర్చలు జరిపి జాతీయ విద్యావిధానంలో అనేక సంస్కరణలు తెచ్చామన్నారు. దీనిపై ఎంత ఎక్కువగా చర్చ జరిగితే దేశానికి అంత ప్రయోజనం ఉంటుందన్నారు. 21వ శతాబ్దానికి అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు తెచ్చామని, కొత్త విద్యావిధానం భావితరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మోదీ వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. టిక్‌టాక్‌..యూఎస్‌లోనూ నిషేధం

సోషల్ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ నిషేధంపై పరిశీలిస్తున్నామని ఇప్పటికే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తాజాగా ఆ దిశగా చర్యలు చేపట్టారు. టిక్‌టాక్‌ లేదా చైనాకు చెందిన దాని మాతృసంస్థతో సంబంధాలపై 45 రోజుల్లోగా నిషేధం అమల్లోకి రావాలని గురువారం ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అమెరికాలో టిక్‌టాక్‌ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 20లక్షలు దాటిన కరోనా కేసులు!

భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డుస్థాయిలో కొవిడ్‌ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 62,498 కేసులు నమోదయ్యాయి. భారత్లో ఒక్కరోజులోనే 60వేల కేసులు దాటడం ఇదే తొలిసారి. అంతకుముందు జులై 31న అత్యధికంగా 57,151 కేసులు బయటపడ్డాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో మొత్తం కరోనా కేసులసంఖ్య 20,27,034కు చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బీరుట్‌లో పేలుడు జరిగే సమయంలో ఇలా..

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో పేలుడు జరిగి మూడు రోజులు దాటింది. తాజాగా పేలుడుకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఘటనా సమయంలో పేలుడు జరిగిన చోటులో పరిస్థితి.. నగరం ఎలా ఉలిక్కి పడిందనే దృశ్యాలు సోషల్‌మీడియాలో దర్శనమిస్తున్నాయి.  వీటిల్లో ఘటనా స్థలంలో.. అగ్నిమాపక సిబ్బంది పేలుడుకు కొద్ది సేపు ముందు ఎలా పోరాడుతున్నారు.. ఆ గోదాం పరిస్థితి ఏమిటో స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అచ్చెన్న ఇంకా రిమాండ్‌లో ఉండటం బాధిస్తోంది

ఏ తప్పూ చేయని మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు ఇంకా రిమాండ్‌లో ఉండటం బాధిస్తోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు. అచ్చెన్న కుటుంబం దశాబ్దాలుగా ప్రజా సేవలో ఉందని గుర్తుచేశారు. మంత్రిగా అచ్చెన్న తీసుకున్న నిర్ణయాల్లో పట్టుమని రూ.10లక్షల అవినీతి చూపలేకపోయినా.. కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. కక్ష సాధింపులకు ఓ పరిధి, పరిమితి ఉంటుందన్నారు. అచ్చెన్న నిర్దోషిగా బయటకు వస్తారని సోమిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నేతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలి: లోకేశ్‌

కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడున్నర లక్షల మంది చేనేత కార్మికులు, 81వేల పవర్‌ లూమ్‌ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలందరికీ లోకేశ్‌ ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కారణంగా అమ్మాల్సిన సరకు చేనేతల వద్దే ఆగిపోయిందని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సీఎం రమేష్‌కు కరోనా పాజిటివ్

భాజపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ కరోనా బారినపడ్డారు. కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సీఎం రమేష్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. వైద్యుల సూచనమేరకు హైదరాబాద్‌లో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ ఎలాంటి ఆనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సరికొత్తగా రామాయణ మహాకావ్యం

భారతీయ సంప్రదాయాల్లో పురాణాలు, ఐతిహాసాలకు ఉన్న ప్రాధాన్యత ఎంతో గొప్పది. వాటిలో ఒకటి రామాయణ మహాకావ్యం. ఎన్ని విధాలుగా చెప్పినా, ఎంతగొప్పగా వర్ణించినా అందులోని తత్వం నిత్య నూతనమే. రాములోరి సద్గుణాలను, రామాయణంలోని తత్వాన్ని పాటిస్తే ఉత్తమ పౌరులుగా రాణించవచ్చనేది జగమెరిగిన సత్యం. అయితే, నేటితరం పిల్లలకు ఆ మాధుర్యం దూరమవుతోంది. పురాణాలు, ఐతిహాసాలు పెద్దగా తెలియడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భోజ్‌పురి నటి ఆత్మహత్య!

సినీ పరిశ్రమలో నటీనటుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. తాజాగా భోజ్‌పురి నటి అనుపమ పథాక్‌(40) ముంబయిలో ఆత్మహత్యకు పాల్పడింది. బిహార్‌లోని పుర్నెయాకు చెందిన అనుపమ కొంతకాలంగా ముంబయిలో నివాసముంటోంది. భోజ్‌పురి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లోనూ నటిస్తోంది. తాజాగా ఆమె ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అయితే చనిపోయే ముందురోజు అనుపమ తన ఫేస్‌బుక్‌ పేజీలో ఓ వీడియోను పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భజ్జీ ఔట్‌చేస్తే చాలు.. ఫీల్డర్లు ఏదో అనేవాళ్లు

ఆస్ట్రేలియా ఆటగాళ్లపై టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఎప్పుడూ ఆధిపత్యం చెలాయించేవాడు. 2001 నుంచీ అతడికది అలవాటుగా మారింది. తన వైవిధ్యమైన దూస్రాలతో వారిని కంగారు పెట్టించేవాడు. అలాంటి దిగ్గజం తనని ఔట్‌ చేసినప్పుడల్లా టీమ్‌ఇండియా ఫీల్డర్లు ఏదో అనేవారని ఆ జట్టు మాజీ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌ చెప్పాడు. తాజాగా ‘లైవ్‌కనెక్ట్‌’ కార్యక్రమంలో పాల్గొన్న గిల్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.