close

తాజా వార్తలు

Updated : 05/08/2020 13:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. అయోధ్యలో వైభవంగా భూమిపూజ 

అయోధ్యలో రామధామానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. రామమందిర నిర్మాణానికి భూమి పూజ ప్రారంభమైంది. వేద పండితులు ప్రధాని చేతుల మీదుగా ఈ క్రతువు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, మాజీ సీఎం ఉమాభారతి, యోగా గురు రామ్‌దేవ్‌ బాబా, పలువురు పీఠాధిపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అయోధ్యలో పారిజాత మొక్కను నాటిన ప్రధాని

అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన కొనసాగుతోంది. హనుమాన్‌గఢీ ఆలయంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజల అనంతరం ప్రధాని అయోధ్య రామాలయం వద్దకు చేరుకున్నారు. రామాలయంలోని ఉత్సవ విగ్రహానికి పూజ చేశారు. అనంతరం పారిజాత మొక్కను నాటారు. ప్రదానితో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. కాసేపట్లో రామమందిర నిర్మాణానికి ప్రధాని చేతుల మీదుగా భూమిపూజ జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. హనుమాన్‌గఢీలో మోదీ ప్రత్యేక పూజలు

అయోధ్య చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదట హనుమాన్‌గఢీ ఆలయానికి వెళ్లి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగే ప్రదేశానికి బయల్దేరారు. ప్రధానితో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూమిపూజ కార్యక్రమానికి ఆహ్వానాలు అందుకున్న ప్రముఖులంతా ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారత్‌: 40వేలకు చేరువలో కరోనా మరణాలు!

భారత్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం 50వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌ మరణాలు కూడా రికార్డుస్థాయిలో చోటుచేసుకుంటున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 857 మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 39,795కు చేరింది. రోజువారీగా చూస్తే, 24గంటల వ్యవధిలో ప్రపంచంలో అత్యధిక మరణాలు భారత్‌లోనే చోటుచేసుకున్నాయి. నిన్న ఒకేరోజు కొత్తగా మరో 52,509 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెలంగాణలో 2,012 కరోనా కేసులు

 తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం(4వ తేదీన) 21,118 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,012 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 70,958కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 13 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 576కి చేరింది. కరోనా నుంచి నిన్న 1139 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కొవిడ్‌ను జయించిన వారి సంఖ్య 50,814కు చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి యుద్ధ విమానం!

ఓఎల్‌ఎక్స్‌లో ఇప్పటి వరకు మొబైల్ ఫోన్లు, బైకులు, కార్లు, గృహోపకరణాలను మాత్రమే అమ్మకానికి ఉంచేవారు. తాజాగా ఓ ప్రబుద్ధుడు ఏకంగా యుద్ధ విమానాన్నే ఇందులో అమ్మకానికి పెట్టాడు. ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన మిగ్‌-23 యుద్ధ విమానాన్ని ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి 2009లో ఐఏఎఫ్ బహుమతిగా ఇచ్చింది. దీనిని యూనివర్శిటీ ఆవరణలోని ఇంజనీరింగ్ కళాశాల ముందు భాగంలో ప్రదర్శనకు ఉంచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రాజ్యాంగ ప్రతిలో రామాయణ ఘట్టం

అయోధ్యలో ఈరోజు జరగనున్న రామమందిర నిర్మాణ భూమి పూజ కోసం అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్‌ లగ్నంలో ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ రాముడికి సంబంధించిన ఓ చిత్రాన్ని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. రాముడు రావణుడిని ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చే సందర్భాన్ని తెలియజేసే చిత్రం అది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం

 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాయలసీమ ఎత్తిపోతల ఉత్తర్వులు రద్దు చేయాలని, టెండరు ప్రక్రియ చేపట్టకుండా చూడాలని పిటిషన్‌లో కోరింది. శ్రీశైలం జలాశయం బ్యాక్‌ వాటర్‌ నుంచి  కృష్ణా నీటిని అదనంగా తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తలపెట్టింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వారెవ్వా.. ఇంగ్లాండ్‌ను బోల్తా కొట్టించిన ఐర్లాండ్‌

వన్డే ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టును పసికూన ఐర్లాండ్‌ ఓడించింది. మంగళవారం అర్థరాత్రి ముగిసిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ సంచలనం సృష్టించింది. 329 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒక బంతి మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి ఛేందించింది. టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ పాల్‌ స్టిర్లింగ్‌(142; 128 బంతుల్లో 9x4, 6x6), కెప్టెన్‌ ఆండ్రూ బాల్బిర్నీ(113; 112 బంతుల్లో 12x4) శతకాలతో చెలరేగిపోవడంతో ఆ జట్టు విజయం సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మేమెప్పుడూ తలదించుకునే పనిచేయలేదు

సూర్యుడి కిరణాలు కూడా పడని చోటులో ఉన్న వారి సమస్యలను కూడా సమాజానికి చూపించే సత్తా ఉన్న స్త్రీ ఆమె. ఎందుకంటే ఆమె మైక్‌ పట్టి పలకరిస్తే, ప్రేమగా దగ్గరకు చేరే హృదయాలు ఎన్నో.. ఆమె మైక్‌ పట్టి ప్రశ్నిస్తే దొరికే సమాధానాలు ఇంకెన్నో.. బుల్లితెరపై ఆమె ఉంటే టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌.. వెండితెరపై టౌన్‌ ఆఫ్‌ ది టాక్‌.. ఆమే యాంకర్‌ ఝాన్సీ.. కొన్ని వేల గులాబీల పరిమళం తన నవ్వు.. కొన్ని లక్షల తేనె చుక్కల మాధుర్యం తన మాట.. కొన్ని కోట్ల ఆశీస్సులు తన పాట.. ఆమే సింగర్‌ సునీత.. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి వీరిద్దరూ విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.