close

తాజా వార్తలు

Updated : 07/07/2020 12:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. తెలంగాణలో కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభం

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను చూసి ప్రజలు భయాభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌పై అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఆ సంస్థ ఆవిష్కరించిన ‘కొవాగ్జిన్‌’ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ఇప్పుడు తెలంగాణలో ప్రారంభమయ్యాయి. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ఆరోగ్యవంతులైన వ్యక్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిమ్స్‌లో నేటి నుంచి ప్రారంభమైంది. ఆరోగ్యంగా ఉండి ట్రయల్స్‌కు సమ్మతించిన వ్యక్తుల రక్త నమూనాలను నిమ్స్‌ సిబ్బంది సేకరించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భార‌త్‌లో 7ల‌క్ష‌ల కేసులు, 20వేల మ‌ర‌ణాలు!

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌తో భార‌త్ అత‌లాకుతలం అవుతోంది. గ‌త‌వారం రోజులుగా నిత్యం 20వేల‌కు పైగా పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. తాజాగా దేశంలో నిన్న 22,252 కేసులు బ‌య‌ట‌ప‌డ‌డంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,665కి చేరిన‌ట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌శాఖ వెల్ల‌డించింది. ఇక‌ దేశంలో కొవిడ్ మ‌ర‌ణాల సంఖ్య క‌ల‌వర‌పెడుతోంది. తాజాగా నిన్న ఒక్క‌రోజే 467మంది మృత్య‌వాత‌ప‌డ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. చైనా యాప్‌లపై నిషేధం దిశ‌గా అమెరికా?

టిక్‌ టాక్‌తో స‌హా 59చైనా యాప్‌ల‌ను భార‌త్ నిషేధించిన విష‌యం తెలిసిందే. భార‌త్ దారిలోనే అమెరికా అడుగులు వేస్తోంది. తాజాగా టిక్‌టాక్‌తోపాటు చైనా సామాజిక మాధ్య‌మాల‌ యాప్‌ల‌ను నిషేధించే యోచ‌న‌లో ఉన్న‌ట్లు అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో వెల్ల‌డించారు. ఓ అంత‌ర్జాతీయ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మైక్ పాంపియో ఈ విధంగా అభిప్రాయ‌ప‌డ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నూతన టీఎస్‌ సచివాలయం నమూనా ఖరారు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న నూతన రాష్ట్ర సచివాలయం నమూనా ఖరారైంది. తాజాగా సచివాలయం నమూనా చిత్రాన్ని సీఎం కార్యాలయం విడుదల చేసింది. ఎప్పటి నుంచో ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించాలని నిర్ణయించింది. కానీ న్యాయపరమైన అడ్డంకులు వచ్చిపడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇంటి స్థలాల పేరుతో భారీ అవినీతి: నక్కా ఆనంద్‌బాబు

వైకాపా నేతల వాటాల్లో తేడాలు రావడం వల్లే ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా పడ్డాయని తెదేపా నేత నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. పేదల ఇళ్ల స్థలాల్లో అవినీతి జరిగిందంటూ గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయంలో ఆయన నిరసన దీక్షప్రారంభించారు. ఈ సందర్భంగా నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ ‘‘ఇళ్ల స్థలాల పంపిణీని తెదేపా అడ్డుకుందని చెప్పడ హాస్యాస్పదంగా ఉంది. ఇంటి స్థలాల పేరుతో భారీ కుంభకోణం జరిగింది. దానిపై విచారణ జరపాలి’’అని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. విదేశీ విద్యార్థులకు అమెరికా భారీ షాక్‌!

ఇప్పటికే హెచ్‌-1బీ వంటి పలు వీసాలు, గ్రీన్‌కార్డుల జారీపై నిషేధం విధించిన అమెరికా ప్రభుత్వం మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది.  విదేశీ విద్యార్థులకు భారీ షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు విద్యాసంస్థలు సిద్ధమైనట్లయితే విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని ప్రకటించింది. అలాగే  కొత్తగా విద్యార్థి వీసాలు జారీ చేయబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) సోమవారం ప్రకటన విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కొవిడ్‌ వ్యాక్సిన్‌: కేజీహెచ్‌లో ఎథిక్స్‌ కమిటీ భేటీ

 విశాఖలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభానికి ఇంకా తేదీ ఖరారు కాలేదు. క్లినికల్‌ ట్రయల్స్‌కు సిద్ధంగానే ఉన్నా.. ప్రభుత్వ నిర్ణయం, అనుమతి కోసం కేజీహెచ్‌ అధికారులు ఎదురుచూస్తున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్‌ ఇటీవల కేజీహెచ్‌ను ఎంపిక చేసింది. ఇవాళ్టి నుంచి క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభానికి షెడ్యూల్‌ ప్రకటించింది. క్లినికల్‌ ట్రయల్స్‌ బాధ్యతను ఏఎంసీ ఆచార్యుడు వసుదేవ్‌కు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఇవాళ కేజీహెచ్‌లో ఎథిక్స్‌ కమిటీ భేటీ కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పీవోకేలో చైనా వ్యతిరేక నిరసనలు!

పాక్ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లో పాకిస్థాన్‌, చైనాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. నీలం, జీలం నదులపై అక్రమంగా చేపడుతున్న జల విద్యుత్‌ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ముజఫరాబాద్‌ నగరంలో అనేక మంది సోమవారం ఆందోళన చేపట్టారు. ‘సేవ్‌ రివర్స్‌ సేవ్‌ జమ్మూకశ్మీర్‌’ పేరిట సామాజిక మాధ్యమాల్లోనూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన పాకిస్థాన్‌-చైనా ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు చేసుకుంటాయంటూ నిరసనకారులు నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సరికొత్త పరిస్థితికి అనుగుణంగా టాటా

కొవిడ్‌-19 కారణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా  టాటాగ్రూప్‌ కూడా మారుతుందని ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. ఫిబ్రవరిలో టాటా కెమికల్స్‌ టాటాగ్లోబల్‌ బేవరేజస్‌లో విలీలమైన తర్వాత నిర్వహించిన తొలి వార్షిక సమావేశం ఇది కావడం విశేషం. కరోనావైరస్‌ వ్యాప్తి కారణంగా దీనిని వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ ‘‘ మేము భారతీయ మార్కెట్లలో రవాణా విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఏపీ మంత్రి బాలినేని ఎస్కార్ట్‌ వాహనం బోల్తా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఎస్కార్ట్‌ వాహనం ప్రమాదానికి గురైంది. మంత్రి బాలినేని గచ్చిబౌలి నుంచి విజయవాడ వెళ్తుండగా పెద్దఅంబర్‌పేట బాహ్యవలయ రహదారి వద్ద ఆయన ఎస్కార్ట్‌ వాహనం టైర్‌ పేలి బోల్తా పడింది. ఈ ఘటనలో హెడ్‌కానిస్టేబుల్‌ పాపయ్య మృతి చెందగా.. ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని