close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 04/07/2020 13:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. రెండు వారాల్లో కరోనా ఔషధ ప్రయోగ ఫలితాలు

కొవిడ్‌-19ను నయం చేసే ఔషధాలపై జరుగుతున్న ప్రయోగ ఫలితాలు మరో రెండు వారాల్లో రానున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 39 దేశాల్లో 5,500 మందిపై ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఇటు భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లో వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో డబ్ల్యూహెచ్‌వో తాజా ప్రకటన ఆశలు రేకెత్తిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అమరావతిని కేంద్రం కాపాడాలి: చంద్రబాబు

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని చంపేందుకు ఎన్నో కుట్రలు చేశారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్త చేశారు. అమరావతి ఉద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా రాజధాని రైతులకు మద్దతుగా తెదేపా ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయలో నిరసన దీక్ష చేపట్టారు. అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులర్పించారు. అమరావతిని కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపైన కూడా ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భారత్‌కు పెరుగుతున్న అగ్రదేశాల మద్దతు!

చైనా దురాక్రమణ వైఖరిని గమనించిన వివిధ దేశాలు భారత్‌కు బాసటగా నిలుస్తున్నాయి. డ్రాగన్‌ కుట్రలను పసిగట్టి మన దేశ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తున్నాయి. చైనా దుర్బుద్ధిని ఎండగడుతున్నాయి. భారత సరిహద్దుల్లో డ్రాగన్‌ దుశ్చర్యల్ని ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌ ఖండించాయి. తాజాగా ఈ జాబితాలో జపాన్‌ కూడా చేరింది. సరిహద్దు విషయంలో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా చేస్తున్న ఏకపక్ష చర్యలపై వివిధ దేశాలు ఎలా స్పందించాయో చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భార‌త్‌లో ఒక్క‌రోజే 23వేల కేసులు!

దేశంలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. నిత్యం 20వేల‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోదవుతున్నాయి. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లోనే 22,771 పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో శ‌నివారంనాటికి దేశంలో మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 6,48,315కు చేరింది. వీరిలో నిన్న ఒక్క‌రోజే 442మంది కన్నుమూసినట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. మొత్తం బాధితుల్లో ఇప్ప‌టివ‌ర‌కు 3,94,227 మంది కోలుకోగా మ‌రో 2,35,433 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మా ఆఫీసే అప్రమత్తం చేసింది: డబ్ల్యూహెచ్‌వో  

వుహాన్‌లో తొలి దశలో వైరల్‌ న్యూమోనియా కేసులు వస్తున్న సమయంలో చైనాలోని తమ కార్యాలయమే తొలుత అప్రమత్తమై చైనాను సమాచారం కోరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తరచూ ప్రపంచ ఆరోగ్య సంస్థ పనితీరు పై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ విధంగా స్పందించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 200వ రోజుకి చేరిన అమరావతి ఆందోళన

రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా విజయవాడ ఆటోనగర్‌లోని ఐకాస కార్యాలయ వద్ద ఉద్యమంలో అమరులైన రైతులు, రైతు కూలీలకు నివాళులర్పిస్తూ నిరసన దీక్ష చేపట్టారు. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమలో పలువురు ఐకాస నేతలు పాల్గొని రాజధాని పోరాటంలో మృతి చెందిన రైతులు, రైతు కూలీలకు నివాళులర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఒకే రాజధాని కోసం ఉద్యమిద్దాం: లోకేశ్‌

7. జూ.ట్రంప్‌ గర్ల్‌ఫ్రెండ్‌కు కరోనా..!

అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్‌ ట్రంప్‌ స్నేహితురాలు కింబర్లీ గుయిల్‌ఫాయల్‌కు కరోనా వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని అమెరికా మీడియా వెల్లడించింది. గతంలో ఫాక్స్‌ న్యూస్‌లో పనిచేసిన ఆమె ప్రస్తుతం ట్రంప్‌ ఎన్నికల ప్రచార బృందంలో సీనియర్‌ ఫండ్‌ రైజర్‌గా వ్యవహరిస్తున్నారు.  ట్రంప్‌ ఆంతరంగీకుల్లో తాజాగా ఈ వైరస్‌ బారినపడింది కింబర్లనీనే కావడం విశేషం. ఈ ఘటనతో అమెరికాలో వైరస్‌ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గత శతాబ్దంలో కనిపెట్టిన వ్యాక్సిన్లు ఇవి!

కరోనా వైరస్‌ ఇప్పట్లో అంతమయ్యే అవకాశాలు కనిపించట్లేదు. వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎంత ప్రయత్నించినా కేసులు రోజుకురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అందరు వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. దీన్ని తయారు చేయడానికి శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తున్నారు. ప్రస్తుతం అన్నీ ప్రయోగదశలో ఉన్నాయి. త్వరలో వినియోగంలోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో గత శతాబ్ద కాలంలో వైద్య రంగం అభివృద్ధి చేసిన కొన్ని వ్యాక్సిన్ల గురించి తెలుసుకుందాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తాగొద్ద‌న్నందుకు త‌ల్లినే కాల్చిచంపిన యువ‌కుడు!

మ‌ద్యం తాగుతున్నాడని మంద‌లించినందుకు క‌న్నత‌ల్లినే కాల్చిచంపిన విషాధ ఘ‌ట‌న దిల్లీలో చోటుచేసుకుంది. ఉత్త‌ర దిల్లీలోని బ‌వనాన‌గ‌ర్‌కు చెందిన సుర‌జ్‌(26) అనే యువ‌కుడు డ్రైవ‌రుగా ప‌నిచేస్తున్నాడు. నిత్యం మ‌ద్యం తాగడంతోపాటు ఇంటికి ఆల‌స్యంగా వ‌స్తుండ‌డంతో త‌ల్లి మంద‌లించింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ యువ‌కుడు మ‌ద్యం మ‌త్తులో త‌న ద‌గ్గ‌రున్న ‌నాటు తుపాకీతో త‌ల్లిపై కాల్పులు జ‌రిపాడు. ఆమె ఎడ‌మ కంటిలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయ‌ప‌డింది. విష‌యాన్ని స్థానికులు పోలీసుల‌కు తెలియ‌జేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కరోనాతో తెలుగు సినీ నిర్మాత కన్నుమూత

కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీలు, మంత్రులు అందరూ దీని బారిన పడుతున్నారు. షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడంతో ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎవరో ఒకరు ఈ వ్యాధికి గురవుతున్నారు. తాజాగా తెలుగు సినీ నిర్మాత పోకూరి రామారావు కరోనా సోకి మృత్యువాతపడ్డారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.